A place where you need to follow for what happening in world cup

కన్నబిడ్డను అమ్మకానికి తల్లి!

తల్లిపైనా కేసు నమోదు చేసి విచారణ ఎస్‌హెచ్‌వో రఘుపతి వెల్లడి

0 46

కన్నబిడ్డను అమ్మకానికి తల్లి!

—తల్లిపైనా కేసు నమోదు చేసి విచారణ ఎస్‌హెచ్‌వో రఘుపతి వెల్లడి..

తెలంగాణ ఫోకస్ న్యూస్ (సబ్ ఎడిటర్ బి.నరేష్)

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తల్లి కన్నబిడ్డను అంగట్లో అమ్మకానికి పెట్టింది. ఈ ఘటన వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,నగరంలోని రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో భిక్షాటన చేసే మహిళకు తొమ్మిది నెలల మగబిడ్డ ఉన్నాడు.
బిడ్డను రూ.1.20 లక్షలకు విక్రయించాలని ఆమెకు నగరానికే చెందిన ఒక మహిళ డబ్బు ఆశచూపింది. అందుకు ఆ తల్లి సరేనంది. డబ్బులు ఇవ్వడంతో మూడు రోజుల క్రితం నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి పసికందును అప్పగించింది. ఆయనకు ముగ్గురూ ఆడపిల్లలే కావడంతో మగబిడ్డను అక్రమంగా కొన్నాడు.
యాచకురాలి వద్ద బిడ్డ కనిపించక పోవడంతో అనుమానం వచ్చిన ఓ స్థానికుడు 1098 టోల్‌ ఫ్రీకి సమాచారం ఇచ్చాడు. బాలల సంరక్షణ విభాగం వారు నగరంలోని ఒకటో ఠాణా పోలీసులతో కలిసి విచారణ చేపట్టారు. బిడ్డను కొన్న వ్యక్తిని ఠాణాకు పిలిపించారు. ఆ వ్యక్తితో పాటు పసిబిడ్డ తల్లిపైనా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. బిడ్డను బాలల సంరక్షణ కేంద్రంలో అప్పగించామన్నారు. ఈ ఘటనలో మధ్యవర్తి, మరో ఇద్దరి ప్రమేయంపైనా ఆరా తీస్తున్నామన్నారు. నిందితులని తేలితే వారిపై చర్యలు తప్పవన్నారు. వారం రోజుల కిందట నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన మహిళ ఇదే తరహాలో మగబిడ్డను విక్రయించిన ఘటన వెలుగుచూడగా.. నలుగురిపై కేసు నమోదైందనట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!