ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా విద్య ప్రవీణ్ పవార్
తెలంగాణ ఫోకస్ (ఆర్మూర్ న్యూస్) ఆగస్టు12:
ఆర్మూర్ పట్టణంలో బుధవారం నలంద హైస్కూల్ లో జరిగిన ఆర్మూర్ మండల ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ సమావేశంలో అధ్యక్షుడిగా విద్య హైస్కూల్ అధినేత, రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ మాజీ అధ్యక్షలు విద్య ప్రవీణ్ పవార్ గారిని, సెక్రటరీ గా నలంద హైస్కూల్ చైర్మెన్ నలంద ప్రసాద్, కోశాధికారిగా స్కాలర్స్ స్కూల్ కరస్పాండెంట్ స్కాలర్స్ వేణు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్లు ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీ భాషిత పొలపల్లి సుందర్, ట్రస్మా రాష్ట్ర బాధ్యులు కాంతి గంగారెడ్డి, మానస గణేష్ లు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు విద్య ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ.. బడ్జెట్ పాఠశాలల విద్యాభివృద్ధికి, అసోసియేషన్ బలోపేతానికి తోడ్పాటు అందిస్తూ ఆర్మూర్ మండలాన్ని విద్యాధికారుల సహకారంతో తెలంగాణ లోనే ఒక ఉత్తమ ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చడానికి , విద్యార్థులకు సంస్కారమైన, నాణ్యమైన విద్యను అందించే విధంగా పాటుపడతామని తెలిపారు,
ఈ సమావేశంలో నలంద సాగర్, విద్య గోపి కృష్ణ, జెంటిల్ కిడ్స్ ప్రకాష్, కాంతి శశాంక్, సెయింట్ పాల్ బబ్లూ, శ్రీమోడల్ మల్లేష్ గౌడ్, సిద్ధార్థ్ గంగారెడ్డి, మల్లయ్య , ప్రజ్ఞ వంశీ తదితరులు పాల్గొన్నారు.