A place where you need to follow for what happening in world cup

29వ వార్డు కమల నెహ్రూ కాలనీ ఎస్సీ మాదిగ సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక..

సంఘ సభ్యుల సహకారంతో కాలనీ అభివృద్ధి చేస్తాం: నూతన కార్యవర్గం సభ్యులు...

0 51

29వ వార్డు కమల నెహ్రూ కాలనీ ఎస్సీ మాదిగ సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక..

తెలంగాణ ఫోకస్ (ఆర్మూర్ న్యూస్) 23ఆగస్టు 2026: ఎస్సీ మాదిగ సామాజిక వర్గం, కమల నెహ్రూ కాలనీ సంఘ సభ్యుల భాగస్వామ్యంతో నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యుల సహకారంతో ఏకగ్రీవంగా ఆదివారం ఎన్నుకోవడం జరిగింది.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని 29వ వార్డు ఎస్సీ కాలనీ లో మాదిగ సంఘ పెద్దల ఆధ్వర్యంలో కాలనీ వాసుల సహకారంతో నూతన కార్యవర్గాన్ని మాజీ పెద్ద మనుషుల ఆధ్వర్యంలో సంఘ సభ్యులందరి సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన కార్యవర్గ సంఘ పెద్దమనుషులుగా దుడపాక శ్రీనివాస్, సిర్ర నాగరాజు, బోట్ల మల్లేష్, సిపల్లి ప్రశాంత్ లను సంఘ పెద్ద మనుషులుగా, సహాయకర్తలుగా సిర్ర సాయిలు, బోట్ల అనురామ్ లను సంఘ సభ్యులు 2026 -27 సం” గాను ఎన్నుకున్నారు.

ముఖ్యమైన తీర్మానాలు & బాధ్యతలు
సమాజ సంక్షేమం: ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజల హక్కులు, విద్యా మరియు ఉపాధి అవకాశాలపై దృష్టి సారించడం.
ప్రభుత్వ పథకాలు: ప్రభుత్వం అందించే ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించేలా కృషి చేస్తామని అన్నారు

సమస్యల పరిష్కారం: కాలనీలో మౌలిక సదుపాయాలు, విద్యుత్, నీరు మరియు డ్రైనేజీ సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని నూతన కార్యవర్గ సభ్యులు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా సంఘ పూర్వ పెద్దలు బచ్చపల్లి దేవయ్య పొన్నాల పోశెట్టి, కందుల రాములు, బచ్చపల్లి చిన్న దేవయ్య, పొన్నాల చంద్రశేఖర్, పొన్నాల రాజేశ్వర్(టెన్ని) మల్లమరి అశోక్, దుడపాక ఆశన్న, దుడపాక వెంకటేష్, రిషి, రాజేష్, సాటేకర్ విట్టల్, మల్యాల నరేష్,మహేష్, బోట్ల అశోక్, పొన్నాల విష్ణువర్ధన్ ప్యానల్ పొన్నాల సన్నీ,పొన్నాల వంశి వర్ధన్ పొన్నాల డేవిడ్, పొన్నాల ఇజ్రాయిల్,పొన్నాల మనోహర్, దాస్, సంఘ మహిళ సభ్యులు మరియు రెడ్డపాక స్వారూప(ఆర్.పి), మల్లమరి నరసమ్మ, మోర్తాడ్ నరసమ్మ, కోలపురి లక్ష్మి,కోలపురి గంగు, సాటేకర్ రుక్మిణి, తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!