A place where you need to follow for what happening in world cup

వారణాసి పేరు వినబడగానే మనకు గుర్తుకు వచ్చేది ‘మణికర్ణికా ఘాట్’.

హిందువులకు మోక్షప్రదాన స్థలంగా పరిగణించబడే అత్యంత పవిత్రమైన శ్మశానవాటిక.

0 60

వారణాసి పేరు వినబడగానే మనకు గుర్తుకు వచ్చేది ‘మణికర్ణికా ఘాట్’.

తెలంగాణ ఫోకస్ భక్తి న్యూస్..

తెలంగాణ ఫోకస్ న్యూస్స్ (సబ్ ఎడిటర్ :బి..నరేష్)

హిందువులకు మోక్షప్రదాన స్థలంగా పరిగణించబడే అత్యంత పవిత్రమైన శ్మశానవాటిక. ఇక్కడ శరీరాలను దహనం చేసిన వెంటనే ఆత్మకు మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భగవాన్ శివుడు స్వయంగా ఇక్కడ ఉండి భక్తులకు ముక్తిని ప్రసాదిస్తారనే నమ్మకం శతాబ్దాలుగా కొనసాగుతోంది.

అయితే, గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ స్మశాన వాటికలో సగం దహనం చేయబడ్డ పార్థివ శరీరాలను, కర్రలను, ఇతర పదార్థాలను గంగలో పడేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే గంగా నదికి చేరడానికి మెట్లు వంటివి కూడా బాగా శిథిలావస్థకు చేరాయి.

మోడీ ప్రధాని అయ్యాక తన నియోజకవర్గం అయిన వారణాసి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. వాటిల్లో విశ్వనాథ కారిడార్, భూగర్భ ఎలక్ట్రికల్ లైన్స్, ఫ్లై ఓవర్స్ ఇలా చాలా ఏర్పాటు చేశారు.

ఇప్పుడు అదే తరహాలో ‘మణి కర్ణిక ఘాట్’ ని కూడా అవసరమైన మార్పులు చేస్తూ, ప్రాచీన వారసత్వ గుర్తులు చెరిపివేయకుండా ఆధునిక సదుపాయాలతో తీర్చి దిద్దడానికి పనులు మొదలుపెట్టారు. మెట్లు పునర్నిర్మిస్తూ ఉంటే కొన్ని ప్రాచీన మూర్తులు ఇతర ఫలకాలు బయట పడినట్లు అధికారులు చెప్పారు.

ఈ ప్రాజెక్ట్‌కు సుమారు 17.56 కోట్ల రూపాయల వ్యయంతో రూపా, JSW ఫౌండేషన్లు వంటి CSR నిధుల ద్వారా అమలు చేయబడుతోంది. Edifice Consultants మరియు INI Design Studio వంటి సంస్థలు దీని డిజైన్‌లో పాలుపంచుకుంటున్నాయి. 2026 చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.

ప్రధాన అభివృద్ధి పనులు:

ఎకో-ఫ్రెండ్లీ గ్రీనేటోరియం : సాంప్రదాయ చెక్క దహనంతో పాటు ఎలక్ట్రిక్ క్రిమేషన్ సౌకర్యం. ఇది చెక్క వినియోగాన్ని 80% వరకు తగ్గిస్తుంది, తక్కువ ఖర్చు మరియు తక్కువ పర్యావరణానికి హాని. అయితే సంప్రదాయ దహన విధానాన్ని కొనసాగించే ఎంపిక కూడా ఉంటుంది.

నాగర శైలి నిర్మాణం : మణికర్ణికా ఘాట్ నుంచి తారకేశ్వర మహాదేవ్ ఆలయం వరకు మూడు అంతస్తుల భవనాలు నాగర శైలిలో నిర్మించబడుతున్నాయి.

ఇతర సౌకర్యాలు : కర్రలు అమ్మకాలకు ప్రత్యేక ప్లాజా, నీటి మార్గం ద్వారా చెక్క తరలింపుకు ర్యాంప్‌లు, ప్రేక్షకులకు సీటింగ్, VIP వీక్షణ ప్రాంతాలు, టాయిలెట్లు, తాగునీరు, CCTV కెమెరాలు.

మణికర్ణికా కుండ్, రత్నేశ్వర మహాదేవ్ ఆలయం, చక్ర పుష్కరిణి కుండ్, దత్తాత్రేయ పాదుక వంటి పురాతన ప్రదేశాల బ్యూటిఫికేషన్. ASI (పురావస్తు శాఖ) పర్యవేక్షణలో 17వ శతాబ్దానికి ముందు ఉన్న నిర్మాణాలకు వేటికి హాని రాకుండా చూస్తున్నారు.

మణికర్ణికా ఘాట్ పునరావాసం కేవలం ఆధునికీకరణ కాదు – ఇది సంప్రదాయాన్ని గౌరవిస్తూ, పర్యావరణాన్ని కాపాడుతూ, పెరుగుతున్న భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రయత్నం. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మణికర్ణికా మరింత గౌరవప్రదంగా, సౌందర్యవంతంగా మారుతుందని భక్తులు ఆశిస్తున్నారు.

హర్ హర్ మహాదేవ్!

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!