అరుంధతి నగర్ ఎస్సీ కాలనీ (మైదం పంత) మాదిగ సంఘం నూతన అధ్యక్షులుగా గంగాని స్వామి.
ఏకగ్రీవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు..
అరుంధతి నగర్ ఎస్సీ కాలనీ (మైదం పంత) మాదిగ సంఘం నూతన అధ్యక్షులుగా గంగాని స్వామి.
(తెలంగాణ ఫోకస్ -పొన్నాల) మే13:
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని అరుంధతి నగర్ ఎస్సీ కాలనీ (మైదం పంత) మాదిగ సంఘం నూతన అధ్యక్షులుగా గంగాని స్వామి ని బుధవారం సంఘ పెద్దలు సభ్యులు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా మాదిగ సంఘం నూతన అధ్యక్షులు గంగాని స్వామి మాట్లాడుతూ.. మాదిగ మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ మాదిగ సంఘం అభివృద్ధి కొరకు పాటుపడుతూనని సంఘ పెద్దల, సభ్యుల సహకారంతో సంఘాన్ని మరింత అభివృద్ధి చేయడానికి, ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకురావడానికి సహకరిస్తానని అన్నారు. మాదిగ సంఘం సంక్షేమం కోసం గత కొన్ని సంవత్సరాల నుండి తన వంతు బాధ్యతగా సంఘ సభ్యులకు సహకరిస్తున్నాను అని, గతంలో,ప్రస్తుతం మాదిగ మహాసేన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని తెలిపారు సంఘ సభ్యులకు ఎంతటి సమస్య అయినా తన వద్దకు తీసుకురావాలని అట్టి సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి ముందు వరుసలో ఉంటానని తెలిపారు. ఏలాంటి వ్యక్తిగత ప్రలోభాలకు గురికాకుండా, సొంత లాభాల కొరకు పని చేయకుండా, సంఘం కోసం అహర్నిశలు పనిచేస్తానని సంఘ అభివృద్ధికి తోడ్పడుతానని సంఘ సభ్యుల ముందు అన్నారు. ప్రస్తుతం అరుంధతి నగర్ మాదిగ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.