ఆర్మూర్ పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ గౌడ్
తెలంగాణ ఫోకస్ న్యూస్ మార్చి 18: ఆర్మూర్ పట్టణ ప్రజలకు ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ గౌడ్ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలషించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు.
పరాభవ నామ సంవత్సరంలో ఆర్మూర్ పట్టణం మరింత ప్రగతి సాధించాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖఃసంతోషాలు, ఆనందోత్సాహాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.