A place where you need to follow for what happening in world cup

33వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బరిలో మున్నూరుకాపు ముద్దుబిడ్డ..

- రాజకీయ పార్టీలతో విసిగిపోయిన యువత. -సమగ్ర సామాజిక రాజకీయం కావాలి: నేటి యువత.

0 87

33వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బరిలో మున్నూరుకాపు ముద్దుబిడ్డ..

రాజకీయ పార్టీలతో విసిగిపోయిన యువత.

పార్టీలకు అతీతంగా ముందు వరస బరిలో స్వతంత్ర అభ్యర్థులు..?

ఉన్నత చదువులు, ఉత్తమ ఆలోచనలు వార్డును అభివృద్ధిపథం కోసం యువత “దిశా నిర్దేశం”.

తెలంగాణ ఫోకస్ -మీ పొన్నాల
ఆర్మూర్ మున్సిపాలిటీలోఎన్నికల బరిలో పలు ప్రధాన పార్టీల తోపాటు మరికొన్ని ఇతర పార్టీల ముందుకొస్తున్నారు.
అలాగే యువత రాజకీయ పార్టీ తీరుతో విసిగిపోయి.. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి రంగం సిద్ధం అవుతున్నారు.

ఆర్మూర్ పట్టణ మున్సిపల్ లో గల 33వ వార్డులో ప్రధానంగా బిసి సామాజికవర్గ ఓటర్లు ఎక్కువ శాతం ఉన్న విషయం తెలిసిందే.
ఇందులో ముఖ్యంగా మున్నూరు కాపు, క్షత్రియ, యాదవులు, ముస్లిం మైనార్టీ సామాజిక వర్గాలతో పాటు ఇతర వర్గాలు గెలుపు ఓటములకు ప్రధాన పాత్ర పోషిస్తారు. గత మూడు పర్యాయాలు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కౌన్సిలర్ గా పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం త్వరలోరానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా మున్నూరుకాపు సామాజికవర్గం రాజకీయ పార్టీలకు ఆతీతంగా పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే దిశలో ఉన్నారని వార్డు ప్రజలు,స్థానికులు చెప్పుకొస్తున్నారు.
మున్నూరుకాపు బిడ్డ ను గెలిపించుకోవాలని దృఢ సంకల్పంతో ముందుకోస్తున్నారు.
గత మున్సిపల్ ఎన్నికల్లో క్షత్రియ సామజిక వర్గానికి చెందిన పండిత్ వినిత పవన్ 33వ గెలిచి మున్సిపల్ చైర్ పర్సన్ అయిన అవార్డును అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు.
మున్నూరు కాపు సామాజికవర్గ బిడ్డ ఎన్నుకొని 33వార్డు ను అభివృద్ధి పథంలో నడిపించే వారిని పార్టీలకు అతీతంగా ఎన్నుకుంటామని గతవారం రోజులుగా చర్చలు జరుపుకుంటున్నారు.
ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఓటరు ముసాయిదా జాబితాపై స్వీకరించిన అభ్యంతరాలను పరిష్కరించి..  ఈ నెల 12న వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు.
ఈనెల 16న ఫోటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డులలోని పోలింగ్ కేంద్రాలలో విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఆర్మూర్ పట్టణంలో 36 వార్డులలో ఫోటోలతో కూడిన ఓటర్ జాబితా ప్రకటించిన తర్వాత వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకటించడన్నారు.
రిజర్వేషన్లు ప్రకటించకముందే ఎన్నికల బరిలో ఉండడానికి అభ్యర్థులు పార్టీలతో ఆశావహులు టికెట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

మున్సిపాలిటీలోని 33వార్డులో పోటీ చేసే ఆశావాహుల పేర్లు ఇప్పటికే గోప్యంగా ఉంచుకుంటున్నారని పట్టణవాసులు ఆయా వార్డు స్థానికులు చెప్పుకొస్తున్నారు. ఓటర్ల తుది జాబితా విడుదల కావడంతో రిజర్వేషన్లపై ఎవరికి వారే అంచనా వేసుకుంటున్నారు.   33వ వార్డులో రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తే పార్టీ టికెట్లు కేటాయించాలని కోరుతున్నారు. కొందరు నాయకులు వార్డులలో పోటీ చేయడానికి ముఖ్య నాయకులతో ఒకరికొకరు సహకరించుకొని మున్నూరు కాపు సామాజికవర్గ బిడ్డను గెలిపించుకోవడానికి దృఢ సంకల్పంతో ఒకే మాట మీద సంఘటితం అవుతూ.. గట్టి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!