– దేశ హైందవ సనాతన ధర్మాన్ని కాపాడడానికి హిందువులు ముందుకు రావాలి: భక్తుడు రాజు గౌడ్ స్వామి.
తెలంగాణ ఫోకస్(సబ్ ఎడిటర్/బోడమీది నరేష్) ఆర్మూర్ న్యూస్: భారతదేశ హైందవ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం, గో సంరక్షణ లక్ష్యంగా ప్రతి సంవత్సరం శబరి యాత్రకు సైకిల్ మీద వెళ్తూ హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం ఎన్ని సార్లు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానని ఆర్మూర్ నుండి శబరి సుమారు రెండు వేల పై చిలుకు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని రాజు గౌడ్ స్వామి తెలిపారు. అంతేకాకుండా తాను గతంలో అయోధ్య రామాలయానికి రెండుసార్లు వెళ్లిన విషయం ఆర్మూర్ వాసులకు తెలిసిందే.. తాను హైందవ ధర్మాన్ని కాపాడడానికి విజయవంతంగా మూడుసార్లు సైకిల్ పై శబరి యాత్రను చేసిన పూర్తి చేశారు ఈ విషయం జిల్లా హైందవ సోదరులకు తెలిసిందే. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి యాత్ర నాలుగుసార్లు తమిళనాడులోని అరుణాచలానికి నాలుగుసార్లు సైకిల్ పై వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నానని అలాగే ధనుష్కోటికి ఒకసారి సైకిల్ యాత్ర పై వెళ్లి పట్టణవాసుల అభినందనలు పొందారు. ప్రతి ఏటా లాగానే ఈ సంవత్సరం కూడా శబరి యాత్రకు దిగ్విజయంగా సైకిల్ పై మూడుసార్లు ముగించుకొని నాలుగోసారి సైకిల్ పై ఆర్మూర్ లోని కుక్కల గుట్టలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి తీర్థం పుచ్చుకుని స్వామి సన్నిధి నుండి శనివారం రోజున బయలుదేరుతున్నట్లు ఆర్మూరు వాసి బి.రాజు గౌడ్ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు.