A place where you need to follow for what happening in world cup

0 88

ఆర్మూర్ లో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి నాయకుల సమావేశం.                        తెలంగాణ ఫోకస్(ఆర్మూర్ రిపోర్టర్-పొన్నాల) నవంబర్28: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రెవ, డా, డి దైవ చిత్తం గారి ఆధ్వర్యంలో ఆర్మూర్లో గల సీయోను రారాజు చర్చి నందు జరిగినది ఈ యొక్క సమావేశంనకు ముఖ్య అతిథిగా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు రెవ, డా, బిషప్ జన్ను ఇర్మియా గారు, జాతీయ ఉపాధ్యక్షులు బిషప్ పీటర్ నాయక్ మరియు జాతీయ బృందం తో రావడం జరిగింది. ఈయొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 9న గోవింద్ పేట్ రాక్ చర్చ్ నందు జరగబోయే గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ ను గూర్చిన వాల్ పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది మరియు ఈ యొక్క కార్యక్రమంను గూర్చి కావలసిన సూచనలు సలహాలు స్థానిక నాయకులకు ఇవ్వడం జరిగింది. బిషప్ జన్ను ఇర్మియా మాట్లాడుతూ.. ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ లో నిజామాబాద్ జిల్లాలో మరియు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి దైవ సేవకులకు విశ్వాసులకు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క సమావేశంలో పాలు పొందినటువంటి వారు తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ మరియు నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు రెవ, పాల్ జాషువ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు డా” జోయెల్ చంద్ర  మరియు జనరల్ సెక్రెటరీ రెవ, జాన్సన్ ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షులు రెవ, ఇమ్మానియేల్  జక్రాన్ పళ్లి మండల్ సెక్రెటరీ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!