అంబేడ్కర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు: హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని: ఆర్మూర్ సబ్ కలెక్టర్, ఏసీపీకి వినతి
- ఆర్మూర్ దళిత ముద్దుబిడ్డ జన్నపల్లి రంజిత్ అన్ని కులాలకు పిలుపు.
డా”అంబేడ్కర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు: హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని: ఆర్మూర్ సబ్ కలెక్టర్, ఏసీపీకి వినతి.
– ఆర్మూర్ దళిత ముద్దుబిడ్డ జన్నపల్లి రంజిత్ అన్ని కులాలకు పిలుపు.
తెలంగాణ ఫోకస్ టీవీ (ఆర్మూర్ న్యూస్)14 సెప్టెంబర్ 2026:
భారత రాజ్యాంగ నిర్మాత, బహుజన రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ‘హమారా ప్రసాద్’పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్మూర్‌లో వివిధ సంఘాల నాయకులు సబ్ కలెక్టర్, ఏసీపీలకు వినతి పత్రం అందజేశారు.
దేశానికి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడిని అవమానించేలా మాట్లాడటం తీవ్రంగా ఖండించదగినదని నాయకులు స్పష్టం చేశారు. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న అతడిపై తక్షణమే కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అధికారులు, పోలీసులను కోరారు.
దిష్టిబొమ్మ దగ్ధానికి పిలుపు
ఈ సందర్భంగా ఆర్మూర్ దళిత ముద్దుబిడ్డ జన్నపల్లి రంజిత్ మాట్లాడుతూ… హమారా ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ఆర్మూర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణంలోని అన్ని కుల సంఘాలు, యువజన సంఘాలు మరియు రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరై, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.