A place where you need to follow for what happening in world cup

ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా 3వ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..

త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించడానికి ప్రతి పౌరుడికి అవకాశం కల్పించాలి: డాక్టర్ అమృత్ రాంరెడ్డి..

0 47

ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా 3వ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..

తెలంగాణ ఫోకస్ టీవీ (ఆర్మూర్ న్యూస్) సెప్టెంబర్ 17: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు మరియు ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రాంగణంలో 3వ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా తల్లి తెలంగాణ చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడానికి సంబంధిత ఉన్నతాధికారులే కాకుండా నాలుగో తరగతి ఉద్యోగులతో సహా ప్రతి పౌరుడికి అవకాశం కల్పించి వారి చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ అమృత్ రెడ్డి అన్నారు.

  ఈ సందర్భంగా వైద్యులు అమృత్ రామ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట వీరుల కుటుంబ సభ్యులకు ఈ సందర్బంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా అప్పటి వరకు పల్లెలలో నెలకొన్న వెట్టి చాకిరీ, భావ వ్యక్తీకరణపై ఆంక్షలు, మాతృ భాష అణిచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు తొలగి 17 సెప్టెంబర్ 1948 న హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మార్పు వలన రాష్ట్రం దేశ వ్యాప్తంగా కీర్తిగాంచింది. సుస్థిర ప్రజా పాలనతో సంక్షేమాన్ని పంచుతూ సర్వ మతాలనూ సమాదరిస్తూ శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలిచింది. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా ఆదర్శవంతమైన పల్లెలు, పట్టణాలతో ప్రభవిల్లుచున్నదని పేర్కొన్నారు.

 వైద్య మరియు ఆరోగ్యశాఖ:

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రజా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను విజయవంతముగా నిర్వహిస్తూ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తూ రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ఉత్తమంగా ఆరోగ్య సేవలు అందించడం జరుగుచున్నదని తెలిపారు.                                              ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గతంలో ఐదు లక్షలుగా ఉన్న ఆరోగ్య శ్రీ పరిమితిని 09-12-2023 నుండి 10 లక్షల వరకు పెంచడం జరిగింది. జనవరి 2026 నుండి ఆగస్టు 2026 వరకు 16 వేల 55 లబ్ధిదారులు ఆరోగ్యశ్రీ పథకం క్రింద లబ్ది పొందుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ఆర్మూర్ పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రోజు రిత్యా 150 నుండి 200 లోపు రోగులను వైద్యులు చేస్తున్నారని వారికి సేవలు అందిస్తున్నారని తెలుపుతూ సీజన్ వ్యాధుల పట్ల వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.                    ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ అమరేశ్వర్, డాక్టర్ జాకీర్ హుస్సేన్, ల్యాబ్ టెక్నీషియన్ లతో పాటు వివిధ విభాగాల అధికారులు, మహిళా అధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!