A place where you need to follow for what happening in world cup

లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షులు ఆకుల రాజు కు ఇంటర్నేషనల్ ప్రశంస పత్ర సర్టిఫికెట్ అందజేత.

లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షులు ఆకుల రాజు ఆధ్వర్యంలో మరిన్ని సేవ కార్యక్రమాలు చేసేందుకు సమావేశం.

0 60

 లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షులు ఆకుల రాజు కు ఇంటర్నేషనల్ ప్రశంస పత్ర సర్టిఫికెట్ అందజేత.    తెలంగాణ ఫోకస్ మీ పొన్నాల:ఆర్మూర్ పట్టణంలో గల మెడికల్ అసోసియేషన్ హాల్ యందు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షులు ఆకుల రాజు ఆధ్వర్యంలో మరిన్ని సేవ కార్యక్రమాలు చేసేందుకు శనివారం సమావేశమయ్యారు.             ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ 320 D గవర్నర్ లయన్ అమర్నాథ్ విచ్చేసి ఈ సంవత్సరం క్లబ్ చేసిన సేవలను అలాగే కార్యక్రమాలను గురించి తెలుసుకున్నారు. రాబోయే రోజులలో చేయవలసిన సేవ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు సేవా కార్యక్రమాలు ఎలా చేయాలో వాటి పట్ల చేయవలసిన పలు అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షులు ఆకుల రాజు చేసిన సేవలకు గాను ఇంటర్నేషనల్ ప్రశంసా పత్రం సర్టిఫికెట్ తో ఘనంగా సత్కరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ కార్యవర్గ సభ్యులందరు గవర్నర్ గారిని శాలువతో సన్మానించారు. ఈకార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కోశాధికారి మర్రి ప్రవీణ్, రీజినల్ చైర్మెన్ ఏం.రాజన్న, జోనల్ చైర్మెన్ చెరుకు పృథ్వీరాజ్, సుధీర్ బాబు, క్లబ్ సెక్రటరీ లీడర్ శ్రీనివాస్, కోశాధికారి గోపి కృష్ణ, డీకే రాజేష్, గుజరాతి ప్రకాష్, దాచేపల్లి సంతోష్, పోల్కమ్ వేణు, అల్జాపూర్ రాజేష్, యాదగిరి గౌడ్, బారడ్ బాలాజీ రావు, కుంట నరేందర్, బచేవాల్ వేణుగోపాల్, మధు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!