A place where you need to follow for what happening in world cup

తెలంగాణ హైకోర్టు జడ్జి ని సన్మానించిన ఆర్మూర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు

0 45

తెలంగాణ హైకోర్టు జడ్జి ని సన్మానించిన ఆర్మూర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు..                          తెలంగాణ ఫోకస్ ఆర్మూర్ -పొన్నాల: తెలంగాణ హైకోర్టు జడ్జి, నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ జడ్జి శ్రీమతి టీ.మాధవి దేవి నిజామాబాద్ కోర్టును సందర్శించిన సందర్భంగా బార్ అసోసియేషన్ ఆర్మూర్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా వారిని కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాన్ని ఇవ్వడమైనది. ఈ సందర్భంగా ఆర్మూర్ కోర్టులో ఉన్నటువంటి సమస్యలైన మొదటి సమస్య అడిషనల్ డిస్టిక్ట్ కోర్టును ఆర్మూర్ లో ఏర్పాటు చేయాలని, రెండవ సమస్య ఆర్మూర్ కోర్టులో మూడు కోర్టులు నిర్వహించడం జరుగుతా ఉందని కానీ ఆర్మూర్ కోర్టు రెండు కోర్టులకు సంబంధించిన భవనం మాత్రమే ఉండడం వలన న్యాయమూర్తులు, న్యాయవాదులు మరియు కక్షిదారులు ఇబ్బందులకు గురవుతున్నారని కావున ఆర్మూర్ కోర్టు పైన రెండవ అంతస్తు కోర్టు భవనాన్ని నిర్మించాలని, అదేవిధంగా మూడవ సమస్య శిథిలావస్థలో ఉన్న పాత కోర్టును వెంటనే తీసివేసి ప్రమాదం జరగకుండా చూడాలని ఈ సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని ఇవ్వడమైనది. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గటడి ఆనంద్, సంయుక్త కార్యదర్శి మద్దుల గంగారాం, సంయుక్త కార్యదర్శి కుందారం శ్రావణ్, పొద్దేటి శంకర్, కొండి పవన్, ఎర్గట్ల గణేష్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!