A place where you need to follow for what happening in world cup

ఆర్మూర్ లోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో హుండీ అపహరణ.

- హుండీ లో భక్తుల కానుకలు లక్ష రూపాయలపై చిలుక దొంగలిచ్చినట్లు సర్వసమాజ్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు.

0 100

ఆర్మూర్ శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో హుండీ అపహరణ.           హుండీ లో భక్తుల కానుకలు లక్ష రూపాయలపై చిలుక దొంగలిచ్చినట్లు సర్వసమాజ్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు.                                    తెలంగాణ ఫోకస్: ఆర్మూర్ పట్టణంలో గల శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో హుండీ గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించినట్లు ఆర్మూర్ సర్వసమాజ్ అధ్యక్షులు కొట్టాల సుమంత్ తో పాటు సర్వ సమాజ్ సభ్యులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో సర్వ సమాజ్ అధ్యక్షులు కొట్టాల సుమన్ మాట్లాడుతూ.. రోజు పూజల నిమిత్తం యధావిధిగా పూజారి ఉదయం, సాయంత్రం పూజా అనంతరం దేవస్థానానికి రోజువారీగా తాళం వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే వారని సోమవారం మధ్యాహ్నం సమయంలో హుండీని పగలగొట్టి భక్తుల కానుకల రూపంలో భక్తులు లక్ష రూపాయలపై చిలుక వివిధ రకాల ఆభరణాలను, డబ్బులు దొంగలిచ్చినట్లు సర్వసమాజ్ సభ్యులు పోలీసులకు వివరించారు. హుండీలో సుమారు లక్ష రూపాయల పైచిలుకు వివిధ కానుకలు భక్తులు వేసిన వస్తు, ధన, బంగారం, డబ్బులు రూపంలో దొంగలించినట్లు తెలిపారు. ఇలాంటి దొంగలను పట్టుకొని పునరావృతం కాకుండా పోలీస్ శాఖ వారు ప్రత్యేక చొరవ తీసుకుని చట్టపరమైన శిక్షతోపాటు ”హిందూ సమాజానికి మచ్చ తెచ్చే” దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని “హిందూ వాహిని” అధ్యక్షులు మందుల బాలు డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదులో భాగంగా ఆర్మూర్ సర్వ సమాజ్ కోశాధికారి రవి, దొండి శ్యాo, మణి(మనీష్)లతో పాటు “గోల్ బంగ్లా” భక్తులు, కాలనీవాసులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!