A place where you need to follow for what happening in world cup

“తెలంగాణ ఫోకస్” వార్త కథనానికి స్పందన..

సానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్ కు, జవాన్ భజన్న కు కృతజ్ఞతలు తెలిపిన 33వ వార్డు వాసులు..

0 69

“తెలంగాణ ఫోకస్” వార్త కథనానికి స్పందన.                                                సానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్ కు, జవాన్ భజన్న కు కృతజ్ఞతలు తెలిపిన 33వ వార్డు వాసులు..

తెలంగాణ ఫోకస్ @ బొడమీది నరేష్: ఆర్మూర్ మున్సిపల్ అధికారులు 33వ వార్డు వైపు కన్నెత్తి చూసిన దాఖలు లేవు మరి ముఖ్యంగా ఈ వార్డు మల్లారెడ్డి చెరువుకు అనుకొని ఉండటం వల్ల చెరువు నుండి వచ్చే దుర్వాసన దోమలు పందులు వలన సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు కాలనీవాసులు గత మున్సిపల్ కమిషనర్ రాజుకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వార్డ్ వైపు కన్నెత్తి చూసిన దాఖలు లేవు.మరి ముఖ్యంగా గోల్డ్ బంగ్లా(శివాజీ చౌక్) పక్కనే ఉండడం వల్ల పండగ సమయంలో, ర్యాలీల సమయంలో, పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు డైవర్షన్ గా 33 వ వార్డును వాడుతారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఏర్పాటుచేసిన ఐ మాస్ బల్బులు గత సంవత్సరముగా వెలగక కాలనీవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో దొంగలు కాలనీవాసుల యొక్క ద్విచక్ర వాహనాలు నుండి పెట్రోల్ ను, కారుల యొక్క చక్రాలను విప్పుకుపోతున్నారు. నెల రోజుల క్రితం కొండచిలువ చెరువులో నుండి రాత్రి సమయంలో రోడ్డు పైకి రాగా కాలనీవాసులు దానిని చంపివేశారు. ఈ వార్డు మల్లారెడ్డి చెరువుకు ఆనుకుని ఉండడం వల్ల చెరువు పక్కన ఏర్పాటు చేసిన డ్రైనేజీ పూర్తిగా నిండిపోయిందని మున్సిపల్ జవాన్ భజన్నను సంప్రదించగా సానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్ సానుకూలంగా స్పందించి ఈరోజు జెసిబి పరికరంతో డ్రైనేజ్ ని శుభ్రపరచారు. ఇందుకు గాను 33వ వార్డు కాలనీ వాసులు సానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్ ను, ఆయన జవాన్ భజన్న ను కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!