మూడో విడత స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలుపు
- ఆర్మూర్ కాంగ్రెస్ మహిళా పట్టణ అధ్యక్షురాలు మానకొండూరు సంధ్య -జిమ్మీ రవి ధీమా!
మూడో విడత స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలుపు
– ఆర్మూర్ కాంగ్రెస్ మహిళా పట్టణ అధ్యక్షురాలు మానకొండూరు సంధ్య జిమ్మీ రవి ధీమా!
తెలంగాణ ఫోకస్ న్యూస్: సబ్ ఎడిటర్ – బి.నరేష్) ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో మూడో విడతగా జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి సూచనలతో మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్మూర్ కాంగ్రెస్ మహిళా పట్టణ అధ్యక్షురాలు మానకొండూరు సంధ్య( జిమ్మీ రవి) మాట్లాడుతూ.. మొదటి, రెండో విడతల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు వార్డు స్థానాలను గెలుచుకుని ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా పోయిందని, అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా మూడో విడత ఆర్మూర్ డివిజన్ పరిధిలో జరిగే ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అన్ని గ్రామాల ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారని, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రెండు సంవత్సరాలలో అభివృద్ధికి మొదటి రెండు విడతల్లో అత్యధిక స్థానాలు గెలిపించారు. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఫ్రీ బస్సులు, రూ.500కే గ్యాస్ వంటి పథకాలు తెలంగాణ లోని ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లు, వ్యవసాయ కళాశాలల మంజూరు, ఇందిరమ్మ ఇండ్లు, హైడ్రా వంటి ప్రతిష్టాత్మకమైన మరెన్నో నిర్ణయాలను ప్రజా ప్రభుత్వం చేపట్టి అభివృద్ధి సంక్షేమ ఫలాలను ఇంటింటికి చేరేలా చేసిన మన కాంగ్రెస్ ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఆమె తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి,ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డికి కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు అధిక స్థానాలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి అధిష్టానానికి బహుమతి ఇవ్వాలని మహిళా అధ్యక్షురాలు కోరారు.