మరో ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?
తెలంగాణ ఫోకస్ (సబ్ ఎడిటర్ బి నరేష్)
తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈ నెల 23, 27 తేదీల్లో విడుదల చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.
గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలు మొదటి విడత 11, రెండో విడత 14, మూడో విడత 17 తేదీల్లో పూర్తికానున్న నేపథ్యంలో, తదుపరి ఎన్నికల నిర్వహణకు సర్కార్ వేగం పెంచినట్లు తెలుస్తోంది.
2026 జనవరి 26న గ్రామ, మండల కేంద్రాల్లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనాలనే లక్ష్యంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను త్వరితగతిన నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం.