A place where you need to follow for what happening in world cup

త్రిపుర మాత యూత్ ఫౌండషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు..

విజేతలకు బహుమతులు అందచేసిన బీజేపీ నాయకులు కలిగొట గంగాధర్..

0 65

త్రిపుర మాత యూత్ ఫౌండషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు..

—విజేతలకు బహుమతులు అందచేసిన బీజేపీ నాయకులు కలిగొట గంగాధర్..

తెలంగాణ ఫోకస్ న్యూస్ ఆర్మూర్ (సబ్ ఎడిటర్ బి.నరేష్)

సంక్రాంతి సందర్బంగా ఆర్మూర్ పట్టణంలోని 35 వార్డ్ హుస్నాబాద్ కాలనీలో త్రిపుర మాత యూత్ ఫౌండషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలు ,బాలికలు విభిన్న రీతిలో తెలుగు, తెలంగాణ సంస్కృతి ,సాంప్రదాయాలను ప్రతిబింబించేలా అందంగా వివిధ రంగులను ఉపయోగించి ప్రత్యేక ఆకర్షణగా వేసిన ముగ్గులను పరిశీలించి
కలిగొట గంగాధర్ మాట్లాడుతు.. ముగ్గులపోటీలో పాల్గొన్న మహిళలు, విద్యార్థినిలు ఆకాశంలో ఉన్నా ఇంద్రాధనుస్సు నేలపై పరిచరని, సమాజంలో మంచి ఆలోచనలు వచ్చే విధంగా ముగ్గులు వేశారాని, ఆడపిల్లలను రక్షించండి, భద్రత కల్పించండి, ప్లాస్టిక్ వాడద్దు, కలసి మెలసి ఉండాలని, భారత దేశ గొప్ప తనాన్ని చాటి చెప్పే విధంగా ముగ్గులు వేయడం అభినందనీయం అని, మోడీజీ సంకల్పన్ని అర్ముర్ ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత రాకేష్ రెడ్డి , మోడీసంకల్పన్ని, అభివృద్ధి, సంక్షేమన్ని ప్రజలకు అవినీతి లేకుండా అందిస్తున్నారని అన్నారు. మంగళవారం రోజున మహిళలు పురుషులకంటే అన్ని రంగాల్లో ముందు ఉంటున్నారని, ఒక లక్ష్యం పెట్టుకొని కష్టపడాలని, రంగు రంగుల మధ్య ఉన్నా మనం ఇంత ఆనందంగా ఉండడానికి ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగం చేశారాని, ప్రతి ఒక్కరు చరిత్ర తెలుసుకోవాలని, అందరు తల్లి తండ్రులను, గురువులను, అతిథులను గౌరవించాలని అన్నారు. ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు పెట్టి మహిళలను చైతన్యం చేస్తున్న త్రిపుర మాత యూత్ ఫౌండషన్ సభ్యులు అభినందనీయం తెలిపారు.

బహుమతులు ప్రధానం చేసిన బీజేపీ సీనియర్ నాయకులు కలిగోట్ గంగాధర్

ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలో పాల్గొన్న విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు అందచేసిన బీజేపీ సీనియర్ నాయకులు కలిగోట్ గంగాధర్ తో పాటు, జెస్సు అనిల్, బీజేపీ జిల్లా కార్యదర్శి పోల్కం వేణు, బీజేపీ పట్టణ అధ్యక్షులు మందుల బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ బీజేపీ నాయకులు కలిగొట ప్రశాంత్, పిట్ల శ్రీధర్, కుమార్, భారత్ & యూత్ సభ్యులు కత్తి శ్రీనివాస్, అన్వేష్ చింటూ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!