A place where you need to follow for what happening in world cup

చోరీ జరిగిన విధానాన్ని నేరుగా పరిశీలించిన ఆర్మూర్ ఏసిపి.

- దొంగలను అతి త్వరలోనే పట్టుకుని కోర్టుకు హాజరు పరుస్తాం:ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి

0 90

చోరీ జరిగిన విధానాన్ని నేరుగా పరిశీలించిన ఆర్మూర్ ఏసిపి 

– దొంగలను అతి త్వరలోనే పట్టుకుని కోర్టుకు హాజరు పరుస్తాం:ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి

తెలంగాణ ఫోకస్ -మీ బొడమిది నరేష్: ఆర్మూర్ పట్టణంలో ఇటీవల గోల్ బంగ్లా, ఔటు గల్లి, దయానంద్ నగర్ పలు చోట్ల దొంగల బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే..
ఈ ఘటన విషయాన్ని తెలుసుకున్న ఆర్మూర్ ఎసిపి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం ఉదయం సంఘటన స్థలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతటి కఠిన నేరస్తులైన వదిలేది లేదని, దొంగలను పట్టుకొని తాము పోగొట్టుకున్న వస్తువులను, అతి త్వరలోనే రికవరీ చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారని నేరస్తులను పట్టుకుని కోర్టులో హాజరు పరచడం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడంలో ముందు వరుసలో పోలీస్ శాఖ ఉన్నప్పటికీ ప్రజలు గమనించి కొత్త వ్యక్తులను గుర్తించాలని, అనుమానాస్పదంగా కనిపించే వారిని సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని అలాగే 100 కు కాల్ చేయాలని తెలిపారు. పట్టణంలో పలుచోట్ల దొంగతనం జరిగిన విధానాన్ని నేరుగా సందర్శించారు. ఆయన వెంట ఎస్సై రజినీకాంత్ పోలీస్ సిబ్బంది ఐడి పార్టీ అధికారులు ఉన్నారు.

ప్రజలు తమ వ్యక్తిగత జాగ్రత్తలతో పాటు పోలీసులు కల్పించే అవగాహన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, వంద మందితో సమానమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అందుకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గా ఉపయోగపడుతుందని త్వరగా దొంగలను గుర్తించే విధంగా సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!