ఆర్మూర్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: లయన్స్ క్లబ్ మాజీ జోన్ చైర్మన్ చేపూర్ గణేష్.
తెలంగాణ ఫోకస్ -పొన్నాల: జనవరి14: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆర్మూర్ మాజీ జోన్ చైర్మన్ చేపూర్ గణేష్ ఆర్మూర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందం పంచాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో శుభాలు సమకూరాలని, అనుకున్న కార్యాలన్నీ నెరవేరాలని, ఏడాది పొడుగునా ఇంటింటా సిరుల కాంతులు విలసిల్లాలని అభిలషించారు.