ముగిసిన నామినేషన్ లో పర్వం. *నామినేషన్ల స్వీకరణ 5 గంటల సమయంలోపు 298 నామినేషన్ల దాఖలు..
ఆర్మూర్(తెలంగాణ ఫోకస్) జనవరి 30: చివరి రోజు నామినేషన్ల స్వీకరణ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలోపు 55 నామినేషన్ల పత్రాలు దాఖలు వేశారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణం ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద నామపత్రాల స్వీకరణ నిబంధనలకు అనుగుణంగా పట్టణంలోని అన్ని వార్డు స్థానాల అభ్యర్థులు ఆయా పార్టీ నుండి మరియు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు ఐదు గంటల సమయానికి పూర్తయ్యాయి ఇందులో 298 నామినేషన్ దాఖలాలు ఆయా పార్టీనుండి ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేశారు.
ఆర్మూర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో ఏవైనా సందేహాలు ఉంటే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, అనవసర తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించిన మేరకే దాఖలు చేస్తున్నారు.
నామినేషన్ దాఖలలు సమయం ఐదు గంటల లోపు మాత్రమే ఉందని అందుకు అభ్యర్థులు అధికారులకు సహకరించి తమ విలువైన సమయాన్ని కేటాయించుకుని త్వరగా నామినేషన్ దాఖలు చేసుకోవాలని అధికారులు సహకరించాలని తెలిపారు.
రేపటితో నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియలో నిబంధనలను తు.చ తప్పక పాటిస్తూ, జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. చివరి రోజైన శుక్రవారం అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నందున, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా గట్టి బందోబస్తు నడుమ ఆర్మూర్ పోలీస్ శాఖ అధికారులు, టౌన్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ప్రశాంత వాతావరణంలో నామినేషన్ కొనసాగుతూ రక్షణ భద్రత కల్పిస్తున్నారు 