ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఆర్మూర్ మున్సిపల్ లో వేరువేరుగా ఏర్పాటు
తెలంగాణ ఫోకస్ న్యూస్ (సబ్ ఎడిటర్ బి నరేష్…)
త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల దృశ్య అభ్యర్థుల రద్దీని ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి,మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ ప్రక్రియలో భాగంగా మున్సిపల్ సిబ్బంది అభ్యర్థులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూస్తున్నారు . ఇందులో భాగంగా అభ్యర్థులకు, అభ్యర్థులను బలపరిచే వ్యక్తులకు అవసరమైన ధ్రువత్రాలను అందించడానికి, సరైన సలహాలు సూచనలు ఇస్తూ ఉదయం నుండి రాత్రి వరకు అహర్నిశలు అభ్యర్థులకు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థులకు అవసరమైన ప్రాపర్టీ టాక్స్ (ఆస్తి పన్ను) ఇతర పన్నులు, నో అబ్జెక్షన్ (NOC)లెటర్ ఇవ్వడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తున్నారు.
గత రెండు రోజులుగా ఆర్మూర్ మున్సిపల్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
ప్రత్యేక ఏర్పాటుచేసిన ఉన్నత అధికారులకు పట్టణ వాసులు ధన్యవాదాలు తెలుపుతున్నారు..