A place where you need to follow for what happening in world cup

బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధ్వరంలో ఘనంగా సెప్టెంబర్ -17 జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు..

0 13

కాంగ్రెస్ చెరలో తెలంగాణ రాష్ట్రం.

-విముక్తం చేయదానికి మరో పోరుకు సమాయత్తం

-కేసీఆర్ ఫ్యామిలీపై కక్ష సాధింపులు, ఉద్యమ కారులకు వేధింపులు 

-పరాకాష్టకు చేరిన కాంగ్రెస్ ప్రభుత్వ ఉన్మాద చర్యలు

-రేవంత్ రెడ్డి సర్కార్ ను తరిమికొడితేనే తెలంగాణకు అసలైన స్వేచ్ఛ 

 జాతీయ సమైక్యతా దినోత్సవమే మనకు పోరాట స్ఫూర్తి

బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధ్వరంలో ఘనంగా సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు

 

తెలంగాణ ఫోకస్ టీవీ (నిజామాబాద్, సెప్టెంబర్ 17):-

హింసాత్మక ఇందిరమ్మ రాజ్యం పేరుతో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ నిరంకుశ చెరలో తెలంగాణ రాష్ట్రం మగ్గుతోందని 

బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

నిజామాబాద్ నగరంలోని తెలంగాణ భవన్ లో గురువారం సెప్టెంబర్ -17 జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా బీ ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

 అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను 

విముక్తం చేయదానికి మరో పోరుకు సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్న మైందని పిలుపు నిచ్చారు. ఈ రోజు సెప్టెంబర్ 17, జాతీయ సమైక్యతా దినోత్సవం వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగుపెట్టిన రోజు ఇది అని ఆయన పేర్కొన్నారు. కొంతమంది దీనిని విమోచనమని, విలీనం అని అన్నా, వేలాది మంది ఆనాటి రాచరిక వ్యవస్థపై పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.

ఆనాటి పోరాట యోధులకు, అమరవీరులందరికీ బీ ఆర్ఎస్ పార్టీ తరపున శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నానన్నారు.

తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డా అని ఆయన అభివర్ణించారు. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని 1969 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత జరిగిన కేసీఆర్ గారి ఆధ్వర్యంలోని ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం… అన్నింటినీ తెలంగాణ చూసింద న్నారు. చాకలి ఐలమ్మ, షేక్ బందగి, రావి నారాయణరెడ్డి వంటి అద్భుతమైన అమరవీరులకు ఈ తెలంగాణ జన్మించిందన్నారు. కేసీఆర్ పోరాట దీక్ష ఫలించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం ద్వారా ఆరు దశాబ్దాల ఆకాంక్షలు నెరవేరాయన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. కానీ కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి చేసింది శూన్యమని జీవన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలు ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 వాగ్దానాలను ఎగనామ పెట్టి ప్రజలను నట్టేట్లో ముంచారని, ఇదేమి అన్యాయం అని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి చిత్ర హింసలపాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీపై కక్ష సాధింపులు, ఉద్యమ కారులకు వేధింపులకు పాల్పడుతున్నారని జీవన్ రెడ్డి పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వ ఉన్మాద చర్యలు పరాకాష్టకు చేరాయని ఆరోపించారు.

తెలంగాణలో మరోసారి సంక్షేమ, అభివృద్ధి రాజ్యం రావాలని, నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక రాజ్యం రావాలని కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలకి అంతులేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తమ సమస్యలను ప్రస్తావిస్తున్న అన్ని వర్గాల పై రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వంతో దాడి చేయడాన్ని ప్రజాపాలన అంటారా? అని ఆయన నిలదీశారు. ఒకవైపు రైతన్నలు యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే, సీఎం రేవంత్ రెడ్డి సంబంధం లేని అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆయన విమర్శించారు.

డైవర్షన్ పాలిటిక్స్ తో రేవంత్ రెడ్డి ప్రజల కడుపు కొడుతుండు అని ఆయన ఎద్దేవా చేశారు.

ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పైన భారత రాష్ట్ర సమితి పోరాడుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి రాక్షస సర్కార్ ను తరిమికొడితేనే తెలంగాణకు అసలైన స్వేచ్ఛ అని ఆయన అన్నారు. సెప్టెంబర్ -17 జాతీయ సమైక్యతా దినోత్సవమే మనకు పోరాట స్ఫూర్తి కావాలన్నారు.

ఆనాటి పోరాట యోధుల త్యాగాల సాక్షిగా తెలంగాణ బిడ్డలు మరోసారి నేడు పోరాటం చేయవలసిన అవసరం ఉన్నదని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాజిరెడ్డి జగన్ మరియు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!