A place where you need to follow for what happening in world cup

ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి నూతన కార్యవర్గ అధ్యక్షులుగా పుట్టి మురళి..

0 53

ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి నూతన కార్యవర్గ అధ్యక్షులుగా పుట్టి మురళి..

తెలంగాణ ఫోకస్ టీవీ: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి నూతన కార్యవర్గాన్ని గురుస్వాముల సమక్షంలో సోమవారం నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షునిగా పుట్టి మురళి, కార్యదర్శిగా మీసాల రవి, కోశాధికారిగా గాజరెడ్డి నర్సారెడ్డి, గౌరవ అధ్యక్షులుగా పెంట జలంధర్, గౌరవ సలహాదారులుగా జనార్ధన్ గౌడ్, రెడ్డి ప్రకాష్, పోల సుధాకర్, మసాలా సత్యనారాయణ, కాటిపల్లి వెంకటరెడ్డి (పెద్దకాటి), నూతుల శ్రీనివాస్, దత్తు ప్రభు, తిరుపతి రెడ్డి, కొట్టాల సుమన్, వందన లక్ష్మీనారాయణ, ఖందేష్ శ్రీనివాస్, గంట విప్లవ్, పూల నర్సయ్య, పూజ నరేందర్, ఉపాధ్యక్షులుగా బాలాజీ గంగామోహన్, కత్రాజీ ఉదయ్, నందు, దొడ్ల గోపాల్, గటడి గంగా మోహన్ (పెర్కిట్), మహేష్ మోటార్స్ మహేష్, సహాయకోశాధికారిగా షేర్ ఒడ్డేన్న, సంయుక్త కార్యదర్శిలుగా సియట్ అశోక్, పూల ప్రసాద్, ఏనుగు రాహుల్, బాశేట్టి రాజేందర్ (పెర్కిట్), రాజేందర్ (బాపు), భజన మండలి సాంస్కృతిక కార్యక్రమాల ఇన్చార్జిగా శ్రీహరి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మగ్గిడి వెంకటేష్, నూతుల జైపాల్, జన్నెపల్లి రంజిత్, ధన్పాల్ శివ, శుభం, సభ్యులుగా గోల్డ్ కిషన్, కాసుల నవీన్, గంగాధర్ గౌడ్, గుజరాతి సాగర్, సర్జికల్ రాజేష్, తదితరులను నూతన కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పుట్టి మురళి మాట్లాడుతూ.. తనకు అప్పగించిన గురుత్వర బాధ్యతను శ్రద్ధతో, భక్తితో అయ్యప్ప సేవా సమితి అభివృద్ధి కోసం పాటుపడతానని, నూతన ఆలయ నిర్మాణానికి, అయ్యప్ప మాల ధారణ సమయంలో స్వాములకు మౌలిక వసతులు, మాస పూజ, అన్న వితరణ సమయంలో తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన, కృషి చేసిన గురు స్వాములు అందరికీ పాదాభివందనాలు తెలియజేశారు. ప్రతి అయ్యప్ప స్వామి భక్తులతో మమేకమై, గురు స్వాముల సలహా సూచనల మేరకు సేవ సమితి అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులతోపాటు, కౌన్సిలర్లు సడక్ వినోద్, నర్మే నవీన్, సురేష్, నరేష్, అల్జాపూర్ మహేందర్, మీసాల రాజేశ్వర్, గిరీష్, సృజన్, గంగాధర్, మీసాల మహేష్, పూల నాగి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!