ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కును ఓటర్లు తప్పక వినియోగించుకోవాలి: యువనాయకుడు, ప్రముఖ విద్యావేత్త మట్టేల ప్రవీణ్.
ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కును ఓటర్లు తప్పక వినియోగించుకోవాలి.. –యువనాయకుడు, ప్రముఖ విద్యావేత్త మట్టేల ప్రవీణ్ వెల్లడి.
తెలంగాణ ఫోకస్ -పొన్నాల
ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కును ఓటర్లు తప్పక వినియోగించుకోవాలని యువ నాయకుడు,ప్రముఖ విద్యావేత్త మట్టేల ప్రవీణ్ ప్రజలను, ఓటర్లు కోరారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ఈ సందర్భంగా యువనాయకుడు మట్టేల ప్రవీణ్ మాట్లాడారు.. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావాలని సూచించారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటించాలని ఓటర్లకు ప్రజలకు గుర్తు చేశారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని సూచించారు. రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదిగా నిలుస్తోందని మరోసారి గుర్తు చేశారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఎన్నికలు జరిపిస్తోందని, ప్రతీసారి వినూత్న పద్దతులను ప్రవేశపెడుతూ ప్రజలలో చైతన్యాన్ని పెంపోందిస్తుందని యువ నాయకులు మట్టేల ప్రవీణ్ అన్నారు. ఇందులో భాగంగానే ఈసారి మై ఇండియా – మై ఓటు నినాదంతో ఓటర్లను చైతన్య పరుస్తోందని తెలిపారు. స్వేచ్చాయుత వాతావరణంలో మనకు నచ్చిన నాయకులను ఓటు ద్వారా ఎన్నుకునే అవకాశం కేవలం ఓటు హక్కు ద్వారానే సాధ్యమని సూచించారు. పలు దేశాలలో ఓటింగ్ లేకుండా నియంతృత్వ పాలన జరుగుతోందని, అందుకు భిన్నంగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ భారత దేశంలో స్థానిక సంస్థలు మొదలుకుని పార్లమెంటు వరకు క్రమం తప్పకుండా పకడ్బందీగా ఎన్నికలు జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో, మంచి పాలకులను ఎన్నుకోవడంలో ప్రతి ఓటూ ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యం మరింతగా పరిఢవిల్లుతుందని సూచించారు. స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం 1951లో అక్షరాస్యత తక్కువ ఉన్న సమయంలోనూ అందరినీ ఓటింగ్ లో భాగస్వామ్యం చేసేందుకు అప్పటి భారత ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ నేతృత్వంలో ఎలక్షన్ సింబల్ ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, రానున్న మున్సిపల్ ఎన్నికలను కూడా అదే స్పూర్తితో నిర్వహించాలని, ఓటర్లు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.18 ఏళ్ళు నిండిన వెంటనే ఓటరుగా నమోదు అయ్యేలా ఎలక్షన్ కమిషన్ యువతకు వెసులుబాటు కల్పించిందని సూచించారు. ఎన్నికలలో ఎలాంటి ప్రలోభాలకు ప్రభావితం కాకుండా ఓటు వేయాలని, అలాగే జాతి, కుల, మత, లింగ, వర్ణ భేదాలు, బడుగు, బలహీన వర్గాలు అనే తేడా లేకుండా పద్దెనిమిదేళ్లు దాటిన పౌరులందరికీ రాజ్యాంగం ఓటు హక్కును ప్రసాదించిందని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ఓటర్లు తమకు నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం కల్పించినందున, ఈ హక్కును ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ప్రాముఖ్యత, ఔన్నత్యం గురించి యువత ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీనియర్ సిటిజన్లను, కొత్తగా నమోదైన యువ ఓటర్లు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, విద్యార్థిని, విద్యార్థులు, అధిక సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.