A place where you need to follow for what happening in world cup

మున్సిపల్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ , కౌంటింగ్ కేంద్రము పోలింగ్ బూత్ లను పర్యవేక్షన

--పోలీసు కమిషనర్ పి.సాయి చైతన్య..

0 43

భీంగల్ మున్సిపల్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ , కౌంటింగ్ కేంద్రము పోలింగ్ బూత్ లను పర్యవేక్షన:

పోలీసు కమిషనర్ పి.సాయి చైతన్య..

తెలంగాణ ఫోకస్ న్యూస్ ఫిబ్రవరి 10:

ఫిబ్రవరి 11న జరగనున్న భీంగల్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సందర్భంగా మంగళవారం రోజున నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్.,భీంగల్ లో గల ప్రభుత్వ జూనియర్ కాలేజి లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా పర్యవేక్షించడం
జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన తర్వాత భీంగల్ మునిసిపాలిటీ ప్రాంతంలోని వివిధ పోలింగ్ బూత్ ల నుంచి వచ్చేటటువంటి బ్యాలెట్ బాక్స్ లను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
అనంతరం పోలింగ్ బూతులను పర్యవేక్షించడం జరిగింది ఇట్టి పోలింగ్ బూతుల వద్ద ప్రజలు ఎవరు కూడా గుమిగూడకుందా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ ఎ.సి.పి వెంకటేశ్వర్ రెడ్డి , సి.టి.సి ,ఎ.సి.పి రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ , భీంగల్ సి.ఐ పొన్నం సత్యనారాయణ , భీంగల్ ఎస్సైతిరుపతి , కమ్మర్పల్లి ఎస్సై అనిల్ , మోర్తాడ్ ఎస్సై రాము , ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్ ఎం.పీ.డీ.వో గంగుల సంతోష్ కుమార్, ఎం.ఆర్.ఓ ఎం.డి షబీర్ మరియు ఎన్నికల పరిశీలకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!