కేసీఆర్ కు ఛాలెంజ్ విసిరే రేంజ్ రేవంత్ రెడ్డికి లేదు
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి స్పష్టం
కేసీఆర్ కు ఛాలెంజ్ విసిరే రేంజ్ రేవంత్ రెడ్డికి లేదు
–కేసీఆర్ తో పెట్టుకుంటే మాడిమసై పోతరు
–నిద్రలో కూడా కేసీఆర్, కేటీఆర్ పేరునే కలవ రిస్తుండు
తెలంగాణ ఫోకస్ న్యూస్( సబ్ ఎడిటర్ బి. నరేష్)
కేసీఆర్ కు ఛాలెంజ్ విసిరే రేంజ్ సీఎం రేవంత్ రెడ్డికి లేదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
కేసీఆర్ తో పెట్టుకుంటే మాడిమసై పోతరు అని ఆయన హెచ్చరించారు.
రేవంత్ కు కేసీఆర్ ను తిట్టందే రోజు గడవదని ఆయన ధ్వజమెత్తారు.
నిద్రలో కూడా కేసీఆర్, కేటీఆర్ పేరునే కలవరిస్తుండని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పగటి కలలుగంటు న్నాడని ఆయన పేర్కొంటూ
కాంగ్రెస్ కు మళ్లీ అధికారం అందని ద్రాక్షేనని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి ఒక చిల్లర ముఖ్యమంత్రి అని, నోరు తెరిస్తే బూతులు తప్ప ఒక్క మంచి మాట రాదని ఆయన మండి పడ్డారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా దగా చేశారని, ఆరు గ్యారెంటీలు, 420 హామీలను బొంద పెట్టారని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పొలిటిక్స్ చేయడంలో రేవంత్ రెడ్డి ఆరితేరారని ఆయన విమర్శించారు.
డమ్మీ సీఎం రేవంత్ పై ప్రజలకు నమ్మకం లేదన్నారు.
మోడీ, చంద్రబాబు తో కలిసి తెలంగాణ ను నాశనం చేస్తున్న
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఫ్యామిలీని తిట్టుడు తప్ప ప్రజలకు పెట్టుడు లేదని ఆయన అన్నారు.
దేవుళ్ళ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన ప్రమాణాలేమ య్యాయని ఆయన నిలదీశారు. ఇంకా రుణమాఫీ కాని రైతులు లక్షల మంది ఉన్నారన్నారు.
రూ. 15వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పి మాటతప్ప లేదా? అని ఆయన మండిపడ్డారు. రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందక రైతుకు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసరా పెన్షన్లు పెంచి రూ.4వేల చొప్పున ఇస్తామన్న హామీ ఏమైందని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని బుట్ట దాఖలు చేశారని ఆయన విమర్శించారు.
మహిళలకు రూ.2500 చొప్పున ఇస్తామన్న మహాలక్ష్మి పథకాన్ని తుంగలో తొక్కారన్నారు.
విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడిస్తారని ఆయన ప్రస్తావించారు.
కళ్యాణ లక్ష్మి ద్వారా ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారా? అని ఆయన ధ్వజమెత్తారు.
డమ్మీ సీఎం రేవంత్ పై ప్రజలకు నమ్మకం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆయన విమర్శించారు.
2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితమన్నారు.
కాళేశ్వరంపై నిందలు, కృష్ణా గోదావరి జలాలపై తప్పుడు ప్రచారం, టెలిఫోను ట్యాపింగ్ వంటివి కాంగ్రెస్ కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ గ్రాండ్రింపులకు, బెదిరింపులకు భయపడేది లేదని, కేసీఆర్ అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ నేతల తోలు తీసుడేనని జీవన్ రెడ్డి హెచ్చరించారు.