గ్రామ దేవతలకు గంగా జలాలతో అభిషేకం..
తెలంగాణ ఫోకస్ భక్తి న్యూస్ (సబ్ ఎడిటర్ బి.నరేష్…)
ఆర్మూర్ పట్టణంలోని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రతి సంవత్సరం పవిత్ర గంగాజలంతో అభిషేకం చేయడం ఆనవాయితీ ఇందులో భాగంగా ఆదివారం రోజున పట్టణంలో ఉన్న సాంప్రదాయపద్ధమైన డప్పు సన్నాయిలతో నల్ల పోచమ్మ గుడి, రెడ్డి చెరువు హనుమాన్ గుడి, లంబడి పోచమ్మ ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, సిద్దుల గుట్ట పైన ఉన్న రామాలయం, శివాలయం, మహాలక్ష్మి దేవాలయం తో పాటు పట్టణంలో గల అన్ని దేవాలయాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి పవిత్రంగా తీసుకొచ్చిన గంగాజలాలతో తీసుకువచ్చి జల అభిషేకం నిర్వహించి ప్రతి ఇంటికి గంగా జలాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సదరు పెద్దమనుషులు, పెద్ద కాపులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పవిత్ర గంగాజలంతో అభిషేకం నిర్వహించామని ఈ జలాభిషేక ప్రధాన ముఖ్య ఉద్దేశం పట్టణ ప్రజలకు ఎలాంటి అనర్ధాలు జరగవద్దని ,దానితో పాటు పంటలు సమృద్ధిగా పండాలని పశువులు చల్లగా ఉండాలని ఆ దేవత మూర్తుల యొక్క ఆశీస్సులు అందించాలని ప్రతి ఏటా గంగాజలాలతో అభిషేకం నిర్వహిస్తామని తెలిపారు . గంగాజల అభిషేకంతో వివిధ ఆలయాలు భక్తులతో కిక్కిరిసి భక్తులు తమ కోరికలను తీర్చాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సదరు పెద్దమనుషులు పెద్ద కాపులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..