29వ వార్డుగా కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా శర్మ..
—యువత రాజకీయ అరంగేట్రం చేయాలని పిలుపు….
తెలంగాణ ఫోకస్ న్యూస్ (సబ్ ఎడిటర్ బి.నరేష్…)
ఆర్మూర్ మున్సిపాలిటీలో ఎన్నికల పోరుకు అన్ని ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి వస్తున్నట్లు ధీరాజ్ శర్మ విలేకరుల సమావేశంలో తెలుపుతూ యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన భవిష్యత్తుకు సంబంధించిన బ్రహ్మాస్త్రమైన ఓటు అనే ఆయుధంతో ఒకటికి రెండుసార్లు ఆలోచించి తమ అమూల్యమైన ఓటును సరైన అభ్యర్థికి తమ ఓటు వేసినట్లయితే ఓటు వృధా కాకుండా అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 29వ వార్డులో శర్మ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పార్టీలకతీతంగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అన్ని ప్రధాన పార్టీలు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీలు,గత ప్రభుత్వాలు వార్డును అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు స్వతంత్ర అభ్యర్థిగా ఒక్కసారి అవకాశం కల్పిస్తే పార్టీలకు కుల,మతాలకు అతీతంగా వార్డును జిల్లాలోనే ఆదర్శవార్డుగా తీర్చిదిద్దుతానని, గత 30 సంవత్సరాలుగా శర్మ హోటల్ అంటే తెలియని వాళ్లు లేరంటే అది అతిశయోక్తి అన్నారు. 29వ వార్డు నుండి వార్డు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రధాన ఎజెండాగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వార్డును అభివృద్ధి పరచడమే తన లక్ష్యంగా మార్చుకొని రాజకీయ ఆరంగేట్రానికి చదువుకున్న యువత ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా రాజకీయాలకు వచ్చి సామాజిక సేవలో పాలుపంచుకోవాలని తెలిపారు. యువత రాజకీయాలపై ఆసక్తి పెంచుకొని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను చదువుకున్న యువత సులభంగా అర్థం చేసుకొని తాము నివసిస్తున్న గ్రామాన్నే కాకుండా తమ రాష్ట్రాన్ని,దేశాన్ని నడిపించడంలో యువత పాత్ర ఎంతో కీలకమైనదని తెలిపారు..