రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన ఎన్నికల కమిషన్.. రేపటినుండి నామినేషన్ల ప్రక్రియ.
తెలంగాణ ఫోకస్ న్యూస్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించరున్నారు.
31న స్కూటీని ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరగనుంది. 13వ తేదీన కౌంటింగ్ అదే రోజున ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాష్ట్ర మొత్తం మీద సుమారుగా 52 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. ఇందూర్ బల్దియాలోని 60 డివిజన్లలో కాంగ్రెస్,బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దించనుంది. మజ్లిస్ పార్టీ 25 డివిజన్లలో పోటీ చేయనుంది. ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో ప్రధాన పార్టీల నుండి నగరంలోని ప్రముఖులు పోటీకి సై అంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న సమాచారంతో కాంగ్రెస్, బిజెపి పార్టీలు నగరంలో గత వారం రోజులుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి తమ అధిపత్యాన్ని చాటుకున్నారు.