A place where you need to follow for what happening in world cup

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ సెంటర్ ను పరిశీలించిన పోలీస్ కమిషనర్

--నామినేషన్ సెంటర్ల వద్ద పటిష్టమైన పోలీస్ బందొబస్త్ ఏర్పాట్లు

0 51

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ సెంటర్ ను పరిశీలించిన పోలీస్ కమిషనర్

–నామినేషన్ సెంటర్ల వద్ద పటిష్టమైన పోలీస్ బందొబస్త్ ఏర్పాట్లు

తెలంగాణ ఫోకస్ న్యూస్ (సబ్ ఎడిటర్ బి.నరేష్…)

నిజామాబాదు జిల్లా లోని మున్సిపల్ కార్పొరేషన్ / మున్సిపల్ ఎన్నికలు 2026 లో భాగంగా నేడు నిజామాబాదు డివిజన్ లోని టౌన్ 4 పోలీస్ స్టేషన్ పరిధిలోని TTD కళ్యాణ మండపం లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రం ను గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* గారు పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు నామినేషన్ల స్వీకరణ కేంద్రంను పరిశీలించి , నామినేషన్ ప్రక్రియను గురించి తెలుసుకొని , పోలీస్ సిబ్బంది కి నామినేషన్ సెంటర్ దగ్గరలో 100 మీ.ల లోపు నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉంటాయని , అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ని పాటించాలని , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్బంగా నిజామాబాదు ఎ.సి.పి శ్రీ బి. ప్రకాష్ , టౌన్ 4 ఎస్.హెచ్.ఓ శ్రీ సతీష్ కుమార్, ఆర్.ఓ శ్రీ వెంకటేష్ , ఏ.ఆర్.ఓ శ్రీ రమేష్ గౌడ్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!