A place where you need to follow for what happening in world cup

33వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బోగడమీది రాణి -సుమన్ గడప గడపకు ముమ్మరంగా కొనసాగుతున్న ప్రచారం.

ఓటరు మహాశయులారా... ఆశీర్వదించండి.అవకాశం కల్పించండి... అభివృద్ధి చేసి చూపిస్తా: బోగడమీది రాణి-సుమన్.   

0 70

33వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బోగడమీది రాణి -సుమన్ గడప గడపకు ముమ్మరంగా కొనసాగుతున్న ప్రచారం.

ఓటరు మహాశయులారా..ఆశీర్వదించండి.అవకాశం కల్పించండి… అభివృద్ధి చేసి చూపిస్తా: బోగడమీది రాణి-సుమన్.   

తెలంగాణ ఫోకస్ న్యూస్: ఫిబ్రవరి02: ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలో ప్రధాన రాజకీయ పార్టీలు రసవత్తంగా మారాయి. తమ తమ పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రధాన పార్టీ ముఖ్య నాయకులు ఎక్కడికక్కడ మంతనాలు కొనసాగిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో విజయం సాధించాలంటే పార్టీకి బలమైన వ్యక్తి సమర్థవంతమైన నాయకులు ఆ వార్డును అభివృద్ధి పథంలో తీసుకవెళ్లే వారినే గెలిపించుకునే దిశలో ముందుకు వెళ్తూ.. 33వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బోగడమిది రాణి-సుమన్ శుక్రవారం రోజున నామినేషన్ దాఖలు చేశారు. వార్డు ప్రజలు, స్థానికులు వీరితోనే వార్డు అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికలో ముఖ్యంగా ఆర్మూర్ పట్టణానికి చెందిన 33వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థి బోగడమీది రాణి-సుమన్ తాను వార్డు అభివృద్ధి కొరకు ముందుకు రావడం అభినందనీయమని, స్థానికులు వార్డు ప్రజలు వారిని ఆశీర్వదించాలని కోరారు. 33వ వార్డు పెద్దల సహాయ సహకారంతో వార్డును ఆదర్శ వార్డుగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీతోనే వార్డు అభివృద్ధి, పట్టణ అభివృద్ధి పథంలో కొన్నసాగుతుందని అన్నారు,

ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి బోగడమీది రాణి- సుమన్ మాట్లాడుతూ.. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సూచనలకు అనుగుణంగా పనిచేస్తానని వార్డును ఆదర్శవార్డుగా తీర్చిదిద్దుతానని భీమా వ్యక్తం చేశారు వార్డులో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించే దిశలో ముందుకొస్తున్నానని ముమ్మరంగా కొనసాగుతున్న ఈ ప్రచారంలో గడపగడపకు వెళ్లి నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకుంటు, కాంగ్రెస్ పార్టీ పథకాలను ఓటర్లకు వివరిస్తూ ఒక్కొక్కటిగా అధిష్టానం మేరకు పని చేస్తానని పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ పట్టణ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వార్డు ఓటరు మహాశయుల ఆశీస్సులతో వార్డు పెద్దల సహకారంతో గెలిచి మాట నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలిపారు. వార్డును అభివృద్ధి పథంలో తీసుక వెళ్లడానికి పార్టీ అండదండలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.           

 ఓటరు మహాశయులారా అవకాశం కల్పించండి ఆశీర్వదించండి

తనను గెలిపించి పనులు చేయించుకోవాలని విన్నపిస్తూ ఓటర్లను పెద్దలను కోరారు.
ఈ 33వ వార్డులో ఉన్న సమస్యలను స్థానిక పెద్దల సహకారంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట స్వప్న -రాజ్ కుమార్, బొగడమీది సౌందర్య, పాల శిరీష, బోగడ మీది నరేష్ తోపాటు అధిక సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!