33 వార్డులో కాంగ్రెస్ ప్రచారం జోరు…
మీ అమూల్యమైన ఓటు చేతు గుర్తుకు వేసి అభివృద్ధి చేయడానికి అవకాశం కల్పించండి...
33 వార్డులో కాంగ్రెస్ ప్రచారం జోరు…
మీ అమూల్యమైన ఓటు చేతు గుర్తుకు వేసి అభివృద్ధి చేయడానికి అవకాశం కల్పించండి
–33వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థి బోగడమిది రాణి సుమన్
తెలంగాణ ఫోకస్ న్యూస్ ఆర్మూర్
రిపోర్టర్ పొన్నాల చంద్రశేఖర్
ఆర్మూర్ పట్టణ గోల్ బంగ్లా ప్రాంతంలోని 33వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న బోగడమిది రాణి -సుమన్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మీ అమూల్యమైన ఓటును చేతు గుర్తుకు వేసి 33 వార్డును అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రజలను కోరారు, సుదీర్ఘకాలంగా వృత్తిలో కొనసాగుతున్న బోగడమిది రాణి సుమన్, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో కృషి చేస్తూ ప్రజలకు న్యాయం చేశారని స్థానికులు తెలిపారు. 33 వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల లేమితో కాలనీవాసులు గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. తాను గెలుపొందితే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతానని తెలిపారు. ఈ సందర్భంగా 33 వార్డు ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి, కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని రాణి సుమన్ విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో స్థానికులు, మహిళలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.