A place where you need to follow for what happening in world cup

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మామిడిపల్లి చౌరస్తాలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల తనిఖీలు..     

0 95

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మామిడిపల్లి చౌరస్తాలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల తనిఖీలు..     

తెలంగాణ ఫోకస్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నేటి నుంచి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల తనిఖీలు నిర్వహించారు.                      ఇందులో ముఖ్యంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ప్రధాన కూడిక చౌరస్తా వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు బుధవారం రాత్రి నిర్వహించారు.
ప్రజలు,వాహనదారులు, రాజకీయ నాయకులు వారికి సంబంధించిన కార్యకర్తలు ఎన్నికల నిబంధనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని మీడియా ద్వారా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి నాగరాజు కోరారు.                                   ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ప్రధాన కూడికల ప్రాంతాలలో వాహనాల తనిఖీలు కొనసాగుతాయి.. ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణ ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ గౌడ్ సూచనల మేరకు ప్రధా చౌరస్తా వద్ద, గుంపులు గుంపులుగా ప్రచారం చేసే ప్రదేశాల్లో, వాహనదారుల వద్ద తనిఖీలు నిర్వహించారు.                                                               ఇందులో ప్రజలు, వాహనదారులు, రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీస్ అధికారులకు మరియు సంబంధిత శాఖల అధికారులకు సహకరించాలని అధికారులు కోరారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని, ఎలక్షన్ కోడ్ అమలులో ఉందని మరోసారి గుర్తు చేశారు.
                ఈ తనిఖీ అధికారులు ఏఈ నాగరాజు, ముప్కాల్ ఏఎస్ఐ వారి సిబ్బంది సంబంధిత అధికారుల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేసే క్రమంలో ఇతర సామాగ్రి తో పాటు ₹50,000/- రూపాయలు మించి ఉండకూడదని, ఒకవేళ అంతకుమించి డబ్బులు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన పత్రాలు చూపించి సమాధానాలు సానుకూలంగా సమాధానాలు చెప్పాలని, లేనియెడల ఎన్నికల నిబంధనల ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
ఒకవేళ 50,000 మించి డబ్బులు, ఇతర అనుమతి లేని సామాగ్రి తీసుకువెళ్తే వాటికి సంబంధించిన పత్రాలను అడిగిన వెంటనే అధికారులకు చూపించాలని అట్టి డబ్బులు సరిగా ఉండి వాటికి సంబంధించిన పత్రాలు లేనియెడల ఎన్నికల నిబంధనల ఉల్లంఘించినట్లు అవుతారని ఏ.ఈ నాగరాజు ముప్కాల్ ASI సంబంధిత అధికారుల సిబ్బంది ఉన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!