మున్సిపల్ పరిధిలో బీ-ఫామ్ రావడం కొందరికి ఆనందం.. మరికొందరికి నిరాశ.
-పార్టీలకు క్రియాశీల సభ్యతం నుంచి పనిచేసిన అభ్యర్థులను గుర్తించకపోవడం బాధాకరం.
మున్సిపల్ పరిధిలో బీఫామ్ రావడం కొందరికి ఆనందం.. మరికొందరికి నిరాశ.
–పార్టీలకు క్రియాశీల సభ్యతం నుంచి పనిచేసిన అభ్యర్థులను గుర్తించకపోవడం బాధాకరం.
తెలంగాణ ఫోకస్ న్యూస్: ఆర్మూర్ పట్టణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈరోజు అనగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల దాఖల పరిశీలన (స్క్రూటిని) పరిశీలించి అభ్యర్థుల యొక్క గుర్తులను విడుదల చేశారు. ఇందులో కొద్దిగా స్వచ్ఛందంగా నామినేషన్ దాఖలను ఉపసంహరించుకున్నారు. ప్రధాన పార్టీల నుండి కొందరి అభ్యర్థి ఆశవాహులు టికెట్ రాకపోవడంతో నిరాశకు గురయ్యారు
పార్టీలలో అంతర్గత కుమ్ములాట వల్ల ప్రధాన పార్టీ అభ్యర్థులకు బీ-ఫామ్ అభ్యర్థులకు రాకపోవడంతో గత కొంతకాలంగా ప్రధాన పార్టీలో క్రియాశీల సభ్యత్వం మొదలుకొని కార్యకర్తలుగా పనిచేసిన వారిని గుర్తించకపోవడం బాధాకర విషయం అని మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.
ఏదేమైనప్పటికీ ప్రధాన పార్టీలో అభ్యర్థులను గెలిపించుకోవడం మా భుజస్కందాలపై ఉందని బి-ఫామ్ రాని అభ్యర్థులు తెలియజేశారు. స్వతంత్ర అభ్యర్థులు తమ ఉనికిని చాటుకోవడానికి ముందుకొస్తూ వార్డులను అభివృద్ధి చేసే దిశలో రావడం అభినందనీయమని స్థానికులు చెప్పుకొస్తున్నారు.
నామినేషన్ దాఖలు ఉపసంహరించుకున్న అభ్యర్థుల వివరాలు..
Ward 16- 2
Ward 17-4
Ward 18-1
Ward 13-1
Ward 14- nil
Ward 15 – 3
Ward 25 – 01
Ward 26 – Nil
Ward 27 – 02
Ward 28 – 01
Ward 29 – 02
Ward 30 – Nil