A place where you need to follow for what happening in world cup

నూతన కౌన్సిలర్లను మున్నూరు కాపు (JAC) తరుపున ఘనంగా సన్మానం: మల్యాల నర్సారెడ్డి (MNR)

0 51

నూతన కౌన్సిలర్లను మున్నూరు కాపు (JAC) తరుపున ఘనంగా సన్మానం: మల్యాల నర్సారెడ్డి (MNR)

తెలంగాణ ఫోకస్ -మీ పొన్నాల ఫిబ్రవరి22: మున్నూరు కాపు సామాజికవర్గం ఏకం కావాలని, ఇటీవల మున్సిపల్ లో నూతన కౌన్సిలర్లకు మున్నూరు కాపు(జెఏసి) తరుపున శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆదివారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మున్నూరు కాపు(జెఏసి) ఆధ్వర్యంలో నూతనంగా కౌన్సిలర్లుగా గెలుపొందిన ఏడుగురు మున్నూరు కాపు మున్సిపల్ కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మున్నూరు కాపు(జెఏసి) నాయకులు మల్యాల నర్సారెడ్డి (ఎం.ఎన్.ఆర్) మాట్లాడుతూ.. మున్నూరు కాపు యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పలుమార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని జారవిడుచుకున్న మున్నూరు కాపు నేతలు ఈసారి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. పార్టీలకతీతంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థానానికి మున్నూరు కాపు నేతలు పోటీ చేయాలని, పార్టీలకతీతంగా వారిని మున్నూరు కాపు కుల సంఘాలు మద్దతు తెలిపి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఈ సందర్భంగా 3వ వార్డు కౌన్సిలర్ యామాద్రి కవితా భాస్కర్, 35వ వార్డు కౌన్సిలర్ సడాక్ వినోద్, 34వ వార్డు కౌన్సిలర్ నర్మేే నవీన్, 12వ వార్డు కౌన్సిలర్ తాటి నీలిమ హనుమాన్లు, 13వ వార్డు కౌన్సిలర్ కొడిగెల మల్లయ్య, 33 వ వార్డు కౌన్సిలర్ బొగడమీది రాణి సుమన్, 9వ వార్డు కౌన్సిలర్ పోచంపాడ్ శ్రీనివాస్ లను ఘనంగా సన్మానించారు. మున్నూరు కాపుల ఐక్యత బలపడాలనీ, సంఘటితంగా రానున్న ఎన్నికల్లో కూడా మున్నూరు కాపుల ఐక్యతను చాటాలనె ఉద్దేశంతో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించినట్లు మున్నూరు కాపు జేఏసి తరుపున మల్యాల నర్సారెడ్డి (ఎం.ఎన్.ఆర్), ఆకుల మోహన్, ఈజాప రవీందర్ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!