వరంగల్ లో అట్టహాసంగా ‘పీపుల్స్ డైరీ’ 18వ వార్షికోత్సవ వేడుకలు..
"అవినీతి, అక్రమాలపై 'పీపుల్స్ డైరీ' నిరంతర యుద్ధం: బొడ్డు గోపి
“అవినీతి, అక్రమాలపై ‘పీపుల్స్ డైరీ’ నిరంతర యుద్ధం
– అక్షరాలే ఆయుధంగా సమాజ మార్పుకు పత్రిక యాత్ర
– అట్టహాసంగా ‘పీపుల్స్ డైరీ’ 18వ వార్షికోత్సవ వేడుకలు
తెలంగాణ ఫోకస్ టీవీ: హనుమకొండ న్యూస్ ఫిబ్రవరి22: పేదలు, పీడితుల గొంతుగా మారి వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘పీపుల్స్ డైరీ’ దినపత్రిక పనిచేస్తున్నదని ఎడిటర్ కొండపర్తి కిరణ్ అన్నారు. ప్రతి పుటలో, ప్రతి వార్తలో, సామాజిక న్యాయం, ప్రజల హక్కులు, అవినీతి–అక్రమాలపై నిరంతర యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ‘పీపుల్స్ డైరీ దినపత్రిక 18వ వార్షికోత్సవ వేడుకలు హనుమకొండలో ఘనంగా జరుగగా కిరణ్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పత్రిక స్పెషల్ కరస్పాండెంట్ కండె రమేష్ అధ్యక్షత వహించగా కిరణ్ మాట్లాడుతూ పత్రిక పేద ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు వేదికగా పనిచేస్తోందని, అనేక సమస్యలపై గురిపెట్టి వాటి పరిష్కారానికి దిశ చూపడం పత్రిక ప్రధాన లక్ష్యం అన్నారు. ప్రతి కథనం, ప్రతి ఫొటో, ప్రతి అధ్యయనం ప్రజల సమస్యలపై విన్నపంగా, ప్రభుత్వ చర్యలకు ప్రేరణగా మారడానికి. అతి తక్కువ కాలంలోనే ‘పీపుల్స్ డైరీ’ తన ప్రత్యేక అవసరాలను సంపాదించి, పాఠకుల ఆదరణను పొందింది. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం మాత్రమే కాదు, సమాజంలో అవినీతి, అన్యాయం, అక్రమాలకు వ్యతిరేకంగా శక్తివంతమైన ప్రతినిధిగా పత్రిక నిలుస్తోంది. పత్రికలో పనిచేసే రిపోర్టర్లు, సిబ్బంది సహాయ సహకారాలతో పత్రిక దూసుకెళ్తున్నదని, ఇదే ఒరవడితో అందరం సమిష్టిగా క్రుషిచేస్తూ మరింత పైకి ఎదుగుదామని ఆకాక్షించారు.
‘పీపుల్స్ డైరీ’ కరస్పాండెంట్ కండె రమేష్ మాట్లాడుతూ అక్షరాలనే ఆయుధాలుగా మార్చి, సమాజంలో మార్పు తేవడానికి పత్రిక నిత్యం కృషి చేస్తోంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఈ ఒరవడిని ఇలాగే కొనసాగిస్తామన్నారు. పత్రిక ఎదుగుదలకు రిపోర్టర్లు ఏ విధంగా పక్కా ప్రణాళికతో పనిచేయాలో పలు అంశాలపై చర్చించారు. ఆర్మూర్ డివిజన్ రిపోర్టర్ బొడ్డు గోపి వార్షికోత్సవాలో హాజరై జర్నలిస్టుల సంక్షేమం గురించి మాట్లాడారు.. ప్రభుత్వాలు మారిన జర్నలిస్టులకు తప్పని తిప్పలుగా మారాయి అక్రిడేషన్ కార్డు లు..