అభివృద్దే లక్ష్యంగా 35వ వార్డులో సిసి రోడ్డు ప్రారంభించిన కౌన్సిలర్ సడాక్ వినోద్.
తెలంగాణ ఫోకస్ టీవీ మార్చి18: ఆర్మూర్ పట్టణ మున్సిపల్ పరిధిలోని 35వ వార్డు కౌన్సిలర్ యూత్ ఐకాన్ సడాక్ వినోద్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ రోడ్డు ప్రారంభ కార్యక్రమం ముందుగా మున్నూరు కాపు సంఘం ఎదురుగా గల సిసి రోడ్డు పనులు మంజూరు కావడం జరిగిందని, ఒక్కొక్కటిగా వార్డులో నెలకున్న సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం ముందుందని అందుకు వార్డు ప్రజలను సహకరించి తమకు అభివృద్ధి పనులను కొనసాగించుకోవాలని వార్డు కౌన్సిలర్ సడాక్ వినోద్ ఈ ప్రారంభోత్సవంలో వార్డు ప్రజలకు విన్నవించుకున్నారు
ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, యువకులు సడాక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు