ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బిఆర్ఎస్ 8వ వార్డు కౌన్సిలర్ డిచ్ పల్లి శారదా దినేష్..
-మామిడిపల్లి మజీద్ కమిటీ పెద్దలు అభినందించి ఘనంగా సన్మానం.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బిఆర్ఎస్ 8వ వార్డు కౌన్సిలర్ డిచ్ పల్లి శారదా దినేష్.. –మామిడిపల్లి మజీద్ కమిటీ పెద్దలు అభినందించి ఘనంగా సన్మానం.
తెలంగాణ ఫోకస్ టీవీ: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మామిడిపల్లి మైనారిటీ కమ్యూనిటీకి ఎన్నికల్లో ఇచ్చిన మాటను బిఆర్ఎస్ 8వ వార్డు కౌన్సిలర్ డిచ్ పల్లి శారదా దినేష్ లు నిలబెట్టుకున్నారు. రాజకీయాలో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు.
మామిడిపల్లి ఈద్గా మరమ్మత్తుల పని కోసం శనివారం రంజాన్ పవిత్ర పండుగ సందర్భంగా బిఆర్ఎస్ 8వ వార్డు కౌన్సిలర్ డిచ్ పల్లి శారదా దినేష్ లు Rs300000/- అక్షరాల తన సొంత డబ్బులు మూడు లక్షల రూపాయలను మజీద్ కమిటీ వారికి నమాజ్ అనంతరం కమిటీ పెద్దలకు అందజేశారు.
ఈ సందర్భంగా మజీద్ కమిటీ పెద్దల సమక్షంలో కౌన్సిలర్ శారదా దినేష్ ను ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ పెద్దలు, ముస్లిం సోదరులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు