పలు కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసి, మనోధైర్యాన్ని కల్పించిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.
వారంలోపే ఒకే కుటుంబ బంధువులు ఇద్దరు.. ఒక్కరు కొడుకు, మరోకరు అన్న మృతి. – ఆయా కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసి మనోధైర్యాన్ని కల్పించిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.
తెలంగాణ ఫోకస్ టీవీ మార్చి 29: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఇటీవల ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన శ్రీచంద్ర హైస్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి బొగడ మీది హర్షిత్(15) విద్యార్థులతో కలిసి హోలీ పండుగ అనంతరం స్నానాలకు వెళ్లి గుండ్లచెరువులో ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాన్ని, అలాగే వారి బంధువులు కుటుంబ సభ్యులైన దొడ్లే శ్రీనివాస్(47) వ్యవసాయదారులు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆయా కుటుంబాలను పరామర్శించారు. వారి వెంట సీనియర్ నాయకులు పోల సుధాకర్, పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు నందిపేట్ మండల అధ్యక్షులు మాచర్ల సాగర్, అగ్గు క్రాంతి,కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన రాము, 35వ బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి బొగడమీది నర్సయ్య 35వ BRS వార్డు ఇంఛార్జి, మొన్న కౌన్సిలర్ అభ్యర్థి, 10వ వార్డు కౌన్సిలర్ నయీమ్, వెల్మల్ రంజిత్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయా కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి మనోధైర్యాన్ని కల్పించారు.
ఇందులో ముఖ్యంగా గుండ్ల చెరువు పరారీ కి రక్షణ లేకపోవడం నిర్లక్ష్యంగా వహిస్తున్న ప్రభుత్వం మున్సిపల్ సిబ్బంది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని గుండ్ల చెరువు చుట్టూ చిన్నపిల్లలు వెళ్లకుండా కంచ ఏర్పడు చేయాలని మీడియా ద్వారా తెలియజేశారు, అలాగే ఆర్మూర్ బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి & రాష్ట్ర నాయకులు ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి దొడ్లే శ్రీనివాస్ బాల్య మిత్రులు అని వారి అక్క గారైన బొగడమీది ఓడ్డెమ్మ జీవన్ రెడ్డికి వారి బాల్యం గురించి వివరించి బాల్యాన్ని గుర్తుచేసి కన్నీరు మున్నీరై భగవద్వేగాన్ని గురయ్యారు. వారికి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మనోధైర్యాన్ని కల్పించి ఆయా కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు