బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా బాబూ జగ్జీవన్ రాం జయంతి వేడుకలు..
పాల్గొన్న బిఆర్ఎస్ కౌన్సిలర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు
బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా బాబూ జగ్జీవన్ రాం జయంతి వేడుకలు..
తెలంగాణ ఫోకస్ టీవీ –మీ పొన్నాల ఏప్రిల్05:
భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను బిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు.
జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పోల సుధాకర్ సూచనల మేరకు ఆర్మూర్ పట్టణంలోని మల్ల రెడ్డి చెరువు వద్దగల బాబూ జగ్జీవన్ రాం జయంతి వేడుకలను ఆర్మూర్ పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు పూజా నరేందర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ లు గుంజల పృద్వి, అబ్దుల్ అజిమ్, మహమ్మద్ నయీమ్, డిచ్పల్లి దినేష్,ఎస్సి సెల్ అధ్యక్షులు జన్నాపల్లి రంజిత్ మండల యువజన అధ్యక్షులు అగ్గు, క్రాంతి వార్డ్ సభ్యులు సుంకరి రవి,తైసీమ్ అహ్మద్, బోగడమిది నర్సన్న, కళ్యాణ్ వీరితో పాటు కార్యకర్తలు, నాయకులు కలసి బాబూ జగ్జీవన్ రాం పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి జయంతి వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేంధర్ మాట్లాడుతూ.. బాబూ జగ్జీవన్ రాం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రత్యేకించి యువతరం, విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భవిష్యత్తు కోసం, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు జగ్జీవన్ రాం అందించిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. మహనీయుల గొప్పతనాన్ని, వారు చేసిన కృషిని భావితరాలకు తెలియజేస్తూ, వారిలో స్ఫూర్తిని నింపేందుకు ప్రభుత్వం అధికారకంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, జగ్జీవన్ రామ్, ఫూలే వంటి మహనీయుల కృషి ఫలితంగానే నేడు మనమంతా గౌరవప్రదమైన స్థితిలో జీవనాలు వెళ్లదీస్తున్నామని బిఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేంధర్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించారని, తాను చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. ఆయన ఓ మేధావిగానే కాకుండా మంచి వక్తగా, మానవతా దృక్పథం కలిగిన నాయకుడిగా ప్రజాదరణ పొందారని అన్నారు. బీహార్ రాష్ట్రం పాట్నాలోని పది ఎకరాల విస్తీర్ణంతో కూడిన గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రాం సభకు ఆదరణ దక్కకుండా చేసేందుకు ఆనాడు ఆయన రాజకీయ ప్రత్యర్థులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయడం బాబు జగ్జీవన్ రాం కు ఉన్న ఆదరణకు నిదర్శనం అని అన్నారు. ఇలాంటి మహనీయుల ఆశయాలను స్పూర్తిగా తీసుకుని విద్యార్థులు తమ ప్రతిభను మెరుగు పర్చుకోవాలని పిలుపునిచ్చారు.
మహనీయుల జీవిత విశేషాల గురించి తెలుసుకొని, వారి అడుగుజాడల్లో పయనించాలని సూచించారు. ఆర్మూర్ పట్టణంలో వివిధ కుల సంఘాల వారు, దళిత నాయకులు ముందుకు వచ్చి ఘనంగా జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు