మున్సిపల్ కార్మికుల సమస్యలు వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించాలి: బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్.
మున్సిపల్ కార్మికుల సమస్యలు వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించాలి: బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్. ఆర్మూర్ న్యూస్(తెలంగాణ ఫోకస్ టీవీ): ఆర్మూర్ మున్సిపల్ కార్మికులకు రావాల్సిన పిఎఫ్ ఈఎస్ఐ బకాయిలు 65 లక్షల రూపాయలు వారం రోజుల్లో చెల్లించక పోతే నిరావధిక సమస్యకు పిలుపునిస్తమని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు.
ఈరోజు ఆర్మూర్ మున్సిపాల్టీ కార్మికుల ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న దండి వెంకట్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు చెల్లించాల్సిన పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, పెన్షన్ స్కీమ్ సంబంధించి డబ్బులు గత సంవత్సరం నుండి చెల్లించకపోవడం అన్యాయమన్నారు.
2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ బకాయిలు సైతం ఆర్మూర్ మున్సిపాల్టీ కార్మికులకు ఇవ్వలేదని చెప్పారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ తో కలిసి కార్మికులకు సంబంధించిన పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.
మృతి చెందినా 60 సంవత్సరాలు పైబడిన కార్మికుల స్థానంలో కుటుంబ సభ్యులను నియమించాలని, కనీస వేతన చట్టం ప్రకారం డ్రైవర్స్ కు 19,500 అమలు చేయాలని,
మున్సిపల్ చెత్త సెకరణ వాహనాల రిపేర్ లను త్వరితగతిన చేపట్టాలని, మున్సిపల్ కార్మికులు రక్షణ పరికరాలు, యూని పామ్స్, చీపుర్లు, గైపారులు సకాలంలో అందజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, దండోరా నాయకులు రాజు, బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రాజేశ్వర్ , శ్రీను, ప్రసాద్ ,పాండు తదితరులతో పాటు శానిటేషన్, వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్స్,డ్రైవర్స్
పాల్గొన్నారు .