A place where you need to follow for what happening in world cup

ఆర్మూర్‌లో అక్రమంగా నడుస్తున్న “ప్రియాంక & భారతి క్లినిక్ లు” సీజ్.     -జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కఠిన చర్యలు..

డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో ప్రియాంక & భారతి క్లినిక్‌ లు సీజ్... వారి వెంట జిల్లా అధికారులు..

0 52

ఆర్మూర్‌లో అక్రమంగా నడుస్తున్న “ప్రియాంక & భారతి క్లినిక్ లు” సీజ్.        – జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కఠిన చర్యలు..

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ టీవీ)ఏప్రిల్ 6:
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంలో అక్రమంగా నడుస్తున్న “ప్రియాంక క్లినిక్” పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు కఠిన చర్యలు చేపట్టారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో క్లినిక్‌ను సీజ్ చేశారు. ఈ చర్యల సమయంలో పోలీసు సిబ్బంది కూడా హాజరయ్యారు.

లభించిన సమాచారం ప్రకారం, ఈ క్లినిక్ అనేక సంవత్సరాలుగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తోంది. ఇక్కడ పురుషులు, మహిళల వివిధ వ్యాధుల చికిత్స పేరుతో శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నాణ్యతలేని వైద్యం కారణంగా రోగులు ఆరోగ్యం పొందకుండా మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు.

డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ.. గత 2025 వ సంవత్సరంలో కూడా డీఎంహెచ్ఓ రాజ్యశ్రీ మేడం ఫిర్యాదు మేరకు ఈ క్లినిక్‌ను సీజ్ చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉందన్నారు. అయితే క్లినిక్ యాజమాన్యం మళ్లీ అక్రమంగా ప్రారంభించి రోగులకు చికిత్స అందించడంతో తాజా ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీ నిర్వహించగా క్లినిక్ తిరిగి నడుస్తున్నట్లు గుర్తించి, వెంటనే మళ్లీ సీజ్ చేసి బాధ్యులపై కఠిన చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు.

డాక్టర్ రవీందర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, అక్రమ మరియు అనధికార వైద్య కేంద్రాలను ఆశ్రయించవద్దని, ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లోనే చికిత్స పొందాలని సూచించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.                                           ఇక స్థానిక ప్రజలు కూడా ఇలాంటి నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న వారిపై ప్రభుత్వం, ఆరోగ్య శాఖ, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు.

ఆర్మూర్ లో ప్రియాంక & భారతి క్లినిక్ లను సీజ్ చేసిన అధికారులు..

ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహణ.

-పరిశీలించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ రవీందర్, జిల్లా అధికారులు..

“తెలంగాణ ఫోకస్ టీవీ” లో..
ఇప్పటి వార్తలు.. ఇప్పుడే.

(వార్త ఆగదు – నిజం దాగదు)
7386505970

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!