సన్ రైస్ వాకింగ్ గ్రూప్ తరపున ఆర్థిక సహాయం.
– మరిన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలి..
– ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలి..
– కోరిన సన్ రైస్ వాకింగ్ గ్రూప్ సభ్యులు..
ఆర్మూర్ (తెలంగాణ ఫోకస్) -మీ పొన్నాల ఏప్రిల్12: అనారోగ్యంతో బాధపడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బొచ్కర్ వీషోక గారి కుమార్తె బొచ్కర్ అక్షయ కు సన్ రైస్ వాకింగ్ గ్రూప్ తరపున ఆర్థిక సాయం అందజేశారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన బొచ్కర్ అక్షయ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తన తండ్రి బొచ్కర్ వీషోక సన్ రైస్ వాకింగ్ గ్రూప్ సభ్యులకు సమాచారం అందించిన తెలిసిన వెంటనే గ్రూప్ సభ్యులు ముందుకు వచ్చి ఆదివారం ఆర్థిక సహాయాన్ని సన్ రైస్ వాకింగ్ గ్రూప్ తరపున అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు చేపూర్ గణేష్, గోనె దామోదర్, మంచిర్యాల శేషాద్రి,లింగాగౌడ్, శేఖర్, శివదాస్, నాగనాథం ప్రమోద్, బేల్దారి శ్రీనివాస్, కిరణ్ ఉన్నారు