A place where you need to follow for what happening in world cup

ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్ పర్సన్ గా గోనె లహరి రఘు, వైస్ చైర్మన్ కాట్ పల్లి వేంకట్ రెడ్డి..

మిగితా వివిధ పార్టీల, ఇండిపెండెంట్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్నికల అధికారులు..

0 127

ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్పర్సన్ గా గోనె లహరి రఘు, వైస్ చైర్మన్ కాట్ పల్లి వేంకట్ రెడ్డి..     ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ దిశానిర్దేశం కట్టుదిట్టమైన ఏర్పాట్లు.    మిగితా వివిధ పార్టీల, ఇండిపెండెంట్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్నికల అధికారులు,సబ్ కలెక్టర్. ఆర్మూర్(తెలంగాణ ఫోకస్) ఫిబ్రవరి 16 : నిజామాబాద్ జిల్లాలోని నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రశాంతంగా ముగిసాయి.                  నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక కోసం నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశాలకు ఎన్నికల అధికారి, ఆర్మూర్ సబ్ కలెక్టర్ మార్గనిర్దేశంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆర్మూర్ పురపాలక సంఘ సమావేశానికి సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ఎన్నికల అధికారి తోపాటు సంబంధిత అధికారుల సమక్షంలో చైర్ పర్సన్ గోనె లహరి రఘు, వైస్ చైర్మన్ కాట్ పల్లి వేంకట్ రెడ్డి, వివిధ పార్టీల కౌన్సిలర్లు, స్వతంత్ర అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు సోమవారం ఉదయం 11.00 గంటలకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆయా పార్టీల వారీగా సభ్యులు సమావేశ మందిరాలలోకి చేరుకోగా, తెలుగు అక్షరమాలను అనుసరిస్తూ వరుస క్రమంలో నూతనంగా ఎన్నికైన సభ్యులతో ఎన్నికల అధికారులు ముందుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎన్నిక ప్రక్రియను నిశితంగా ఉదయం 11:30 గంటలకు సరిపడా కోరం ఉందని నిర్ధారించుకున్న మీదట ఎన్నిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
ఆర్మూర్ ఏసీపీ వేంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ మరియు వారి పోలీస్ సిబ్బంది నడుమ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి గందరగోళాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుని ప్రశాంత వాతావరణంలో ప్రమాణ స్వీకారం చేయించుకోవడం పోలీస్ శాఖ సహకరించడం అభినందనీయమని సబ్ కలెక్టర్ ప్రశంసించారు.  ప్రమాణ స్వీకారం అనంతరం నూతన మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు మీడియా తో మాట్లాడుతూ.. పట్టణంలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని పట్టణాన్ని సుందరమయంగా మారుస్తానని ఇతర మున్సిపాలిటీలతో పోటీపడి మన ఆర్మూర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క కౌన్సిలర్ సహాయ సహకారాలు నాపై ఉండాలని కోరుతూ.. ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏ బి శ్రీనివాస్(చిన్న), ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ల నేతృత్వంలో  పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని, నాకు సహకరించి బలపరిచిన 35 వ వార్డు కౌన్సిలర్ సీనియర్ నాయకులు సడాక్ వినోద్ అన్న గారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పట్టణంలోని 36 వార్డుల ప్రతి కౌన్సిలర్లకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన కౌన్సిలర్ అభ్యర్థులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఇందుకు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజలందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మున్సిపాలిటీపై ప్రతి కౌన్సిలర్ల పై ఉండాలని కోరారు పట్టణంలో ప్రధాన నెలకొన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి వచ్చేటువంటి అర్జీలను, ఫిర్యాదులను ఒకటికి రెండుసార్లు పరిశీలించి పారదర్శకంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తానని మీడియా ముఖ్యంగా తెలిపారు ఇందుకు కౌన్సిలర్,ఆయా వార్డు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!