దేశభక్తి, సమాజ సేవ ప్రతి ఒక్కరి బాధ్యత: ప్రజ్ఞ హైస్కూల్ కరస్పాండెంట్ వంశీ..
*ప్రజ్ఞ హైస్కూల్ యాజమాన్యం తరఫున ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు..
దేశభక్తి, సమాజ సేవ ప్రతి ఒక్కరి బాధ్యత: ప్రజ్ఞ హైస్కూల్ కరస్పాండెంట్ వంశీ..
తెలంగాణ ఫోకస్ (ఆర్మూర్ న్యూస్) ఆగష్టు 15: ప్రతి భారతీయుడూ దేశభక్తిని అలవర్చుకొని, సమాజ సేవకు ముందుకు రావాలని ప్రజ్ఞ హై స్కూల్ కరస్పాండెంట్ వంశీ పిలుపునిచ్చారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ వంశీ మాట్లాడుతూ.. దేశభక్తి ప్రతి పౌరుడిలోనూ దేశం పట్ల గౌరవం, ప్రేమ ఉండాలని, దేశ శ్రేయస్సు కోసం పాటుపడటం మనందరి ప్రాథమిక ధర్మమని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే సేవాభావం కలిగి, చిన్నతనం నుంచే పిల్లలలో సామాజిక స్పృహ, సేవా గుణాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులపై ఉందన్నారు. యువత సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువత సానుకూల ధోరణితో ముందుకు సాగుతూ సమాజాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మన దేశ మూలాలు సంస్కృతిని కాపాడుకుంటూ, సమాజంలో కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వడమే నిజమైన దేశభక్తి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు నిఖిల్, దీపక్ లతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
