29వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో యువ నాయకుడు గోపాల్ యాదవ్.
–29వ వార్డు అభ్యర్థిగా ఆశీర్వదించండి. అవకాశం కల్పించండి..అభివృద్ధి చేసి చూపిస్తా: గోపాల్ యాదవ్
తెలంగాణ ఫోకస్ న్యూస్: ఆర్మూర్ జనవరి28: ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలో ప్రధాన రాజకీయ పార్టీలు రసవత్తంగా మారాయి.
తమ పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రధాన పార్టీ ముఖ్య నాయకులు ఎక్కడికక్కడ మంతనాలు కొనసాగిస్తున్నారు.
పార్టీలో విజయం సాధించాలంటే పార్టీకి బలమైన వ్యక్తి సమర్థవంతమైన యువ నాయకుడు ఆ వార్డును అభివృద్ధి పథంలో తీసుకవెళ్లే వారినే గెలిపించుకునే దిశలో ముందుకు వెళ్తూ.. స్వతంత్ర అభ్యర్థికి కూడా ప్రధాన స్థానం కల్పిస్తున్న పట్టణ ప్రజలు గోపాల్ యాదవ్ యువ నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ఎన్నికలో ముఖ్యంగా ఆర్మూర్ పట్టణానికి చెందిన 29వ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా యువ నాయకుడు బరిలో ఉన్నారని తెలిపారు. గోపాల్ యాదవ్ తాను వార్డు అభివృద్ధి కొరకు ముందుకు రావడం అభినందనీయమని అంటున్నారు,
29వ వార్డు ప్రజలు ఆయనను ఆశీర్వదించాలని కోరారు. వార్డు పెద్దల సహాయ సహకారంతో వార్డును ఆదర్శ వార్డుగా అభివృద్ధి చేస్తానని స్వతంత్ర అభ్యర్థి గోపాల్ యాదవ్ ఓ ప్రకటన వెల్లడించారు.
29వ వార్డు అభివృద్ధి అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని అన్నారు, వార్డులో నెలకొన్న ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గత ఎలక్షన్లలో బూత్ స్థాయి నుండి ముందు వరుసలో పనిచేసి సముచిత స్థానాన్ని దక్కించుకున్న యువ నాయకుడు గోపాల్ యాదవ్ అని స్థానిక వార్డు ప్రజలు కార్యకర్తలు మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా యువ నాయకుడు గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. తాను చదువుకునే సమయంలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేవాడని యువతకు ఆదర్శంగా నిలిచాడని వారి మిత్రులు చెప్పుకొచ్చారు.
వార్డు అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. 29వ వార్డును అభివృద్ధి పథంలో తీసుక వెళ్లడానికి తనకున్న పరిచయాలు అండదండలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.
అవకాశం కల్పించండి ఆశీర్వదించండి గెలిపించుకొని పనులు సమగ్ర సమానత్వతో పనులు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ 29వ వార్డులో ఉన్న సమస్యలను స్థానిక పెద్దల సహకారంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.