రాష్ట్రస్థాయి క్రీడల్లో ఛాంపియన్ గా నిలిచి బహుమతి గెలుపొందిన బ్రాహ్మణపల్లి విద్యార్థిని మాదరి ప్రణయ.
విద్యార్థి తల్లిదండ్రులు మాదరి సంతోష -మాదరి స్వామి ప్రోత్సాహం, గురువుల ఆశీస్సులు..
రాష్ట్రస్థాయి క్రీడల్లో ఛాంపియన్ గా నిలిచి బహుమతి గెలుపొందిన బ్రాహ్మణపల్లి విద్యార్థిని మాదరి ప్రణయ.
★విద్యార్థి తల్లిదండ్రులు మాదరి సంతోష -మాదరి స్వామి ప్రోత్సాహం, గురువుల ఆశీస్సులు..
★ విద్యార్థిని అభినందించిన జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షార్యదర్శులు వి.ప్రభాకర్ రెడ్డి, మర్కంటి గంగా మోహన్.
ఆర్మూర్ న్యూస్ డిసెంబర్25: (తెలంగాణ ఫోకస్): ఈనెల 24 నుండి 25 వరకు క్రీడా ప్రాంగణం మనోహరాబాద్ మెదక్ జిల్లాలో జరిగిన పదవ రాష్ట్ర సబ్ జూనియర్ బాలికల చాంపియన్షిప్ లో నిజామాబాద్ జిల్లా జట్టు సెమీఫైనల్ లో వరంగల్ జట్టుపై 10-0 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్ కు చేరి ఫైనల్లో మహబూబ్ నగర్ జిల్లా జట్టుపై 06-05 పరుగుల తేడాతో గెలుపొంది టోర్నమెంట్ ఛాంపియన్ గా నిలిచిన మాదరి ప్రణయ కు ప్రశంసించి బహుమతి అందజేసిన జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి.ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ తెలిపారు.
అలాగే ఈ టోర్నమెంట్ లో బెస్ట్ పిక్చర్ గా బి.నిషిత,గురుకుల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ధర్మారం (బి) మాదరి ప్రణయ ప్రత్యేక బహుమతిని అందుకుంది.
ముగింపు కార్యక్రమ ముఖ్యఅతిథిగా విచ్చేసిన సాఫ్ట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి కే శోభన్ బాబు, రాష్ట్ర సాప్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.నవీన్ కుమార్, సంయుక్త కార్యదర్శులు నాగిరెడ్డి, అజయ్, గోవర్ధన్,శర్మ తదితరులు పాల్గొని బహుమతులు అందజేశారు.
జిల్లా జట్టుకు కోచ్ మేనేజర్లుగా అనికేత్, రమేష్, వినయ్ మరియు వీణ తదితరులు పాల్గొన్నారు.