ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం. -ముఖ్యఅతిథిగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.
- కాగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాయి బాబా గౌడ్, ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి.
ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం.
– ముఖ్యఅతిథిగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.
– కాగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాయి బాబా గౌడ్, ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి.
తెలంగాణ ఫోకస్ న్యూస్ -పొన్నాల జనవరి12:
ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు సాయి బాబా గౌడ్ ఆధ్వర్యంలో పివిఆర్ హోటర్ ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటిపల్లి నాగేష్ రెడ్డి, తెలంగాణ కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏ.బి చిన్న, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, మాజీ నిజామాబాద్ గ్రంథాలయ చైర్మన్ మరా చంద్రమోహన్ అతిథులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని దిశ నిర్ధేశం చేశారు.
పట్టణంలో ఉన్న 36 వార్డులకు గాను సుమారు 140 అప్లికేషన్లు రావడం జరిగింది దీనిలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సర్వే ఆధారంగా బలమైన అభ్యర్థులను క్యాండిడేట్లుగా ప్రకటించడం జరుగుతుంది. టికెట్ రాణి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ వారికి వేరే పోస్టులలో ఇప్పియ్యడానికి కృషి చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జీవన్, కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.