జెడ్పిహెచ్ఎస్ ఐలాపూర్ పాఠశాలలో ఘనంగా “స్పోర్ట్స్ డే” వేడుకలు..
తెలంగాణ ఫోకస్ న్యూస్ (సబ్ ఎడిటర్ బి. నరేష్…)
నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలో గల జెడ్పిహెచ్ఎస్ ఐలాపూర్ పాఠశాలలో ‘స్పోర్ట్స్ డే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ సుదర్శన్, ఉప సర్పంచ్, గ్రామ వార్డు సభ్యులు, ఎస్.జి.ఎఫ్ సెక్రటరీ,గ్రామ ప్రముఖులు హాజరయ్యారు…ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లాలయ్య మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మానసిక ఉల్లాసం, ఆనందం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, సహనం, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
పాఠశాలలో వివిధ ఆటలకు సంబంధించిన జట్లు ఏర్పాటు చేసి పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ గేమ్స్‌లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధాన అతిథుల చేతుల మీదుగా అందజేశారు.
అదేవిధంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సదానందం, రామకృష్ణ,విష్ణువర్ధన్, సత్యనారాయణ,హామీదా పర్వీన్,ఉందిరా రామకృష్ణ, సిఆర్పి రాజు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.